Close

07-08-2021 శనివారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో “నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు”లో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణ అమలుపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి డివిజన్ , మండల స్థాయి అధికారులు లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Publish Date : 07/08/2021

పత్రికా ప్రకటన.
ఏలూరు, తేదీ.7.8.2021.

ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నాం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు.

పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా జగనన్న హౌసింగ్ కాలనీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.

శనివారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో “నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు”లో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణ అమలుపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి డివిజన్ , మండల స్థాయి అధికారులు లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి మాట్లాడుతూ. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరికి ఇసుకను ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. 400 -500 ఇళ్లు ఉన్న లేఔట్ వద్ద ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

జిల్లాలో 1,70,699 మంది లబ్దిదారులకు గృహాలు మంజరి చేసామని 1144 లే ఆవుట్లలో 1,08,135 ప్లాట్లు ,సొంత సైట్లలో 32,218 ప్లాట్లు మంజూరు చేసి గృహానిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఈ పథకం కింద సుమారు 1,13 860 మంది లబ్ధిదారులు గ్రౌండింగ్ పనులను పూర్తి చేసుకుని నిర్మాణాలను కొనసాగించడం జరుగుతోందన్నారు.

గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రతి లేఔట్ వద్ద ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు వారికి దగ్గరలో ఉన్న ప్రాంతాల నుండి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 40 కిలోమీటర్ల పైబడి ఉన్న లేఔట్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోందన్నారు. ఎక్కడా కూడా అక్రమాలకు తావు లేకుండా ఇంటి నిర్మాణ పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటల్ ను జిల్లా వ్యాప్తంగా సబ్సిడీ రేట్లపై అందింస్తున్నామన్నారు. అలాగే లేఔట్ ల వద్ద ఇసుక యార్డులను ఏర్పాటు చేయలన్నారు . సిమెంటు, ఇసుక, మెటల్ లభ్యత విషయంలో, అలాగే సకాలంలో లబ్ధిదారులకు చేరవేయడం వంటి విషయాల్లో హౌసింగ్ అనుబంధ అధికారులందరూ.. సమన్వయం చేసుకోవాలని సూచించారు.

లబ్ది దారులు గృహాలు నిర్మించుకునేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని గ్రామాల సమీపం లోనే లేఔట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ,నీటి సదుపాయం ,కరెంటు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 400 నుండి 500 గృహాలు ఉన్న లేఔట్ వద్ద ఇసుక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రీచ్ నుండి ఇసుక తీసుకు వచ్చేటప్పుడు కచ్చితంగా తూకం వేసి తీసుకురావాలని అన్నారు. లబ్దిదారులు 20 మంది ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి మెటల్ కొనుగోలు చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అవుతుందని ఆయన అన్నారు . ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ. ఇళ్ల నిర్మాణాలకు వివిధ శాఖలతో గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టీల్, మెటల్, రవాణా లాంటి సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి గృహ నిర్మాణ సమస్యలను పరిష్కరించడంతో పాటు గృహ నిర్మాణాలను పురోగతిలోకి తీసుకొస్తామన్నారు. గృహాల నిర్మాణం ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలని ,మండల స్థాయిలో కంట్రోల్ రుమాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే 15 రోజుల్లో 16 వేల వరకూ గృహాలు బేస్మెంట్ లెవి ల్ కు తీసుకురావాలని ఆయన సూచించారు . బేస్మెంట్ లెవెల్ లో ఉన్న వాటిని రూప్ లెవల్ కు తీసుకురావాలని ఆయన ఆదేశించారు . ఇప్పటివరకు వచ్చిన మెటీరియల్ను లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలని ఆయన ఆదేశించారు. ఏలూరు డివిజన్లో బోర్ డ్రిల్లింగ్ వెంటనే ప్రారంభించాలని ఆయన సూచించారు. కొన్ని లేఅవుట్లలో సెకండ్ లెవలింగ్ అవసరముందని పట్టణ ప్రాంతాలలో అన్ని లే అవుట్లను గృహనిర్మాణశాఖ పిడి పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో ముందుగా జేసీ (హౌసింగ్) సూరజ్ ధనుంజయ్ “నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు” నిర్మాణంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జేసీలు డా. బి ఆర్ అంబేద్కర్ (రెవెన్యూ), శ్రీమతి పద్మావతి ( సంక్షేమం ), ట్రైనీ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ,హౌసింగ్ శాఖ జిల్లా పిడి ,వేణుగోపాల్ , డి ఆర్ ఓ డేవిడ్ రాజు, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.


press release