పోలవరం తేదీ: 26.7.2021 , నిర్వాసితులకు అండగా ఉంటాం కలెక్టర్ హామీ

పత్రిక ప్రకటన
పోలవరం తేదీ: 26.7.2021
* నిర్వాసితులకు అండగా ఉంటాం కలెక్టర్ హామీ
* వెలురుపాడు మండలం కొఇదా , పోలవరం మండలం లోని కోరుటూరు గ్రామల్లో పర్యటనలో గ్రామస్థులతో కలెక్టర్ ముఖాముఖి
* గ్రామస్తుల ఇంటింటికీ వెళ్లి వారి నుంచి ఓపికగా వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా
పిల్లలకు చక్లెట్లు బిస్కెట్లు అందించి ఉల్లాసంగా వారితో మమేకమైన కలెక్టర్.
పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
సోమవారం వేలేరు పాడు నుండి లంచి లో పోలవరం వరకు పర్యటించి జిల్లాలో గోదావరి పరివాహకంలోని వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి గ్రామాల గురించి తెలుసుకుంటూ కోయిదా ,కోరుటూ రు గ్రామాల్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో ని నిర్వాసితులకు అండగా ఉంటామని, అందుకు సంబంధించిన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రజల సాధకభాధకా లను తెలుసుకున్న కలెక్టర్ , ఇంకా అందించాల్సి ఉన్న ఏమైనా సహాయం, చేయూత పై గ్రామస్థులను అడగడం జరిగింది. కొందరికి నష్టపరిహారం అందలేదని గ్రామస్తులు తెలపగా అందరికి అందే విదంగా చర్యలు తీసుకుంటామని హమీఇచ్చారు . వరద ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాలకు నిత్యావసర సరకులు, కూరగాయలు వాటిపై అభిప్రాయలను తెలుసుకున్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హమీ ఇచ్చారు. గ్రామస్తులు లకు కాయగూరలు, ఉల్లిపాయలు ,వాటర్ పేకెట్లు అందాచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తో గ్రామస్థులు మాట్లాడుతూ, మాకు రేషన్ సరుకులు, నిత్యావసర సరుకులు అధికారులు అందచేసున్నారని తెలిపారు. సోలార్ లాంతర్లు అందచేయాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ సమాధనం ఇస్తూ, తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటన చేసిన విధంగా ప్యాకేజీ కూడా చెల్లింపులు ఇస్తామని, ముంపు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల ను కేటాయించి వారిని అక్కడకు చేరుస్తామని అన్నారు. గురువారం నాటికి బిల్లు పాస్ అవుతాయని త్వరలోనే చెల్లింపు లు చేయడం జరుగుతుందని అన్నారు. నష్టపరిహారం పై గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. నిర్వాసితుల ముంపు గ్రామాల్లో పర్యటించి న కలెక్టర్ చిన్నారులతో ముచ్చటించి, వారికి చాక్ లెట్స్, బిస్కెట్లు , నోట్ బుక్స్ , పెన్లు అందచేశారు. ఈ పర్యటనలో గర్భిణులకు, పిల్లలకు అందచేస్తున్న పౌష్టికాహారం వివరాలు తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు పౌష్టికాహారం గోరుముద్ద అందించడం లేదని చెప్పడం తో చిన్నపిల్లలకు పౌష్టికాహారం గోరుముద్ద అందించాలని , నిర్లక్ష్యం వహించిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆర్ డి ఓ ను ఆదేశించారు. గ్రామంలో ఉన్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం ఉపాధి కల్పిస్తామని ఆయన హామీఇచ్చారు. వలంటీర్ కళ్లావటితో మాట్లాడుతూ పెన్షన్లు 1వ తారికున అందిస్తున్నవాలేద అని ఆగిగారు. అందరికి అందిస్తున్నట్లు ఆమె వివరించారు. గ్రామస్తులు లను చాలా బాగచూసుకోవాలన్నారు. ఇంటి కి తిరుగుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో ఐటీడీఏ పీవో ఓ. ఆనంద్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మి ,ఎస్సి (ఆర్డబ్ల్యూఎస్) వి.రామస్వామి, డిఎస్వో ఎన్. సుబ్బరాజు, వేలేరుపాడు తసిల్ దార్ చెల్లన్న దొర , పోలవరం తహశీల్దార్ సుమతి, డిఎస్పీ లతాకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
————————— సహాయ సెంచలకులు , సమాచార పౌర సంబందాల శాఖ ఏలూరు వారిచే జారీ.