Close

పాలకొల్లు.ఫిబ్రవరి.19,2022. పుర ప్రజలకు పురపాలక సంఘం మంచి సేవలు అందించాలి అని , ఎక్కడా శానిటేషన్ గాని దోమలు గాని ఉన్నాయని పిర్యాదు రాకూడదని, పిర్యాదు వస్తె పురపాలక సంఘం వైఫల్యం చెంది నట్లేనని జిల్లా కలెక్టరు శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అన్నారు

Publish Date : 19/02/2022

పాలకొల్లు.ఫిబ్రవరి.19,2022.

ప్రెస్ నోటు.

నిరుపేదలు ఇళ్లు వేగవంతం చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చెయ్యాలి,ఓ టి యస్ పై అభ్ది దారులకు అవగాహన కల్పించాలి ….

పుర ప్రజలకు పురపాలక సంఘం మంచి సేవలు అందించాలి , ఎక్కడా ఏ చిన్న పిర్యాదు రాకూడదు ….

టిడ్కో మొదటిదశ ఇండ్లను గృహాప్రవేశాలకు సిద్ధం చెయ్యాలి …

జిల్లా కలెక్టరు శ్రీ వి.ప్రసన్న వెంకటేష్ …

పుర ప్రజలకు పురపాలక సంఘం మంచి సేవలు అందించాలి అని , ఎక్కడా శానిటేషన్ గాని దోమలు గాని ఉన్నాయని పిర్యాదు రాకూడదని, పిర్యాదు వస్తె పురపాలక సంఘం వైఫల్యం చెంది నట్లేనని జిల్లా కలెక్టరు శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అన్నారు.పాలకొల్లు పురపాలక సంఘం కమీషనర్ ఛాంబరులో శనివారం వివిధ శాఖలు అధికారులు , సబ్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్ లతో కలసి కలెక్టరు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
అర్భన్ ఇళ్లు నిర్మాణం కార్యక్రమం వేగవంతం చేసి, గృహ నిర్మాణాలకు సిద్ధం చెయ్యాలి, ఓటి యస్ పై లబ్ధి దారులకు అవగాహన కల్పించాలి అన్నారు. అర్బన్ ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్న టార్గెట్ సకాలంలో పూర్తి చెయ్యాలని అన్నారు. మున్సిపాలిటీలలో కొన్ని ప్రాంతాలలో గృహ నిర్మాణాలకు
లే అవుట్ లెవలింగ్ సమస్యవల్ల గృహాలు నిర్మించడంలో కొంచెం వెనకబడి ఉన్నాయని వేగ వంతం చెయ్యాలని తెలిపారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేసి బ్యాంక్ లు ద్వారా సకాలంలో రుణాలు మంజూరు అయ్యేలా బ్యాంకర్స్ ముందుకు రావాలి ,అదికారులు సమన్మయం చేసుకోవాలన్నారు. ఎక్కడా శానిటేషన్ గాని దోమలు వున్నాయి అనే పిర్యాదు వస్థే పురపాలక సంఘం ఆయా అధికారులను బాధ్యులను చేస్తామన్నారు.ఇంటింటికీ చెత్త సేకరణ ప్రతీ రోజు జరగాలి ,రెండు, మూడు రోజులకు ఒకసారి అంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెత్త చెదారం బయట వేస్తే వారికీ ఫైన్ వెయ్యాలని,పరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పురపాలక సంఘం పరిధిలో సచివాలాయాలు, అంగనవాడి, వసతి గృహాలు క్రమం తప్పకుండా అకస్మిక తనిఖీలు చేసి ,లోటుపాట్లు ఉంటే వెను వెంటనే సరిదిద్దాలన్నారు.దోమలు మందు స్ప్రే అయిదు యంత్రాలు కొని,అయిదు సైకిల్స్ కొని ప్రతి వార్డుకు ప్రతి గడపకు మూడు రోజులకు ఒక సారి ,వారానికి మూడు సార్లు తగ్గకుండా స్ప్రే చేసి సమూలంగా దోమలు నిర్మూలించి అంటు రోగాలు రాకుండా చూడాలన్నారు. త్రాగు నీరు , కరెంట్ , స్పందన్ , ఓటి యస్, రహదారులు,డ్రైనేజీలు తది తర వాటిని కలెక్టర్ సమీక్ష చేశారు. దమయపత్తి డ్రైన్ పనులు వెను వెంటనే మొదలు పెట్టాలని, బేజవాడకోడు డ్రైన్ పనులు అంచనాలు సిద్దం చెయ్యాలని డ్రైనేజీ అధికార్లకు కలెక్టరు శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అదేశించారు.

@ రామగుండం పార్క్ , జిమ్ భవనాలు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, , జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ పరిశీలన మిగిలిఉన్న పనులు పై చర్చించారు. జిమ్ పరికరాలు ఏమి వున్నాయి ఇంకా ఏమి కావాలి అని కలెక్టర్ ఆరా తీశారు.

@ ఏ పి జె అబ్ధుల్ కలాం పార్క్ ను పరిశీలించి , తుది రూపు దిద్దుటకు కలెక్టరు, జిల్లా పరిషత్ చైర్మన్ అధికారులతో చర్చించారు.

@ హౌసింగ్ బోర్డు కాలనీలో త్రాగునీటి సమస్య పై కలెక్టరు, జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. అక్కడ ప్రజలకు త్రాగునీటి చాలా చాల ఇంబ్బందులు పడుతున్నామని, ఇది దీర్ఘ కాలిక సమస్య అని , కుక్కలు ,పందులు, దోమలు చాలా ఎక్కువ అని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్ ను ప్రజలు కోరారు. కలెక్టరు స్పందించి నిర్మాణంలో వున్న వాటర్ టాంక్ ను మిగిలి ఉన్న పనులు వెంటనే పూర్తి చేసి వాటర్ టాంక్ ప్రారంభించి త్రాగునీటి సమస్యను తీర్చుతామని,దోమలు కుక్కలు పందులు సమస్య లేకుండా చూడాలని పురపాలక సంఘం కమీషనర్ ను జిల్లా కలెక్టరు శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ అదేశించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు.శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి. పెద్దిరాజు,ఇరిగేషన్ (డ్రైనేజీ ) ఇ ఇ పి. నాగార్జున రావు, పురపాలక సంఘం కమీషనర్ యన్. ప్రసన్న కుమార్, తాహశీల్దార్ శ్రీమతి జి. మమ్మీ ,యం.పి డి వో యస్. వెంకటేశ్వర రావు, డి ఇ ఇ యం. సాంబ శివుడు , బ్యాంకర్స్, సబ్ రిజిస్ట్రార్ అధికారులు, తది తరులు పాల్గొన్నారు.

సమాచార శాఖ.నరసాపురం.