Close

పత్రిక ప్రకటన ఏలూరు తేదీ: 7.8.2021నగరంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం చేనేత వస్త్రాలకు ప్రోత్సహించాలి. – కలెక్టర్ కార్తికేయ మిశ్రా నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ప్రతి ఏటా రూ.24 వేలు ఆర్ధిక చేయూత నిచ్చి ప్రోత్సహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. శనివారం ఆర్ ఆర్ పేటలోని ఆప్కో షో రూమ్ నందు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించగా, ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు.

Publish Date : 07/08/2021

పత్రిక ప్రకటన ఏలూరు తేదీ: 7.8.2021నగరంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం చేనేత వస్త్రాలకు ప్రోత్సహించాలి. – కలెక్టర్ కార్తికేయ మిశ్రా
నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ప్రతి ఏటా రూ.24 వేలు ఆర్ధిక చేయూత నిచ్చి ప్రోత్సహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.
శనివారం ఆర్ ఆర్ పేటలోని ఆప్కో షో రూమ్ నందు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించగా, ముఖ్య అతిధిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో చేనేత కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రభుత్వ సాయంతో చేనేత వృత్తి జీవనాధారం కల కుటుంబాలు నిలబడే ప్రయత్నం చేయాలన్నారు. స్వాతంత్ర్య సమరంలో చేనేత వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మా బట్టలు మేమే తయారు చేసుకుంటాం.. మా సంప్రదాయ వస్త్రాలు మేం చేసుకుంటామని బ్రిటిష్ వారికి మహాత్మాగాంధీ ఎలుగెత్తి చాటిన చరిత్ర కలిగి ఉందన్నారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ క్రియేట్ చేసేలా యువత చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికుల ఉపాది అవకాశం పెరిగేలా చూడాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. గత ఏడాది 2020-21 సంవత్సరం జిల్లాలో రూ.2.69 కోట్ల ఆర్ధిక ప్రయోజనం రూ.24 వేలు చొప్పున 1119 మంది బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేశామన్నారు. జిల్లాలో 16 ప్రాధమిక చేనేత సహకార సంఘాల కు క్యాష్ క్రెడిట్ కింద రూ.124.63 లక్షలు చేనేత ఉపాధి కోసం మంజురూ చేశామన్నారు. వివర్స్ ముద్రా పధకం కింద 2020-21 సంవత్సరం లో 87 మందికి రూ.43.50 లక్షలు మేర రుణాలను మంజూరు చేశామన్నారు.

చేనేత కార్మికులకు సన్మానం:

పడాల నాగరాజు, గుత్తి సోమరాజు, ఎమ్. నాగవరప్రసాద్, కె.నాగేశ్వరి, ఎన్.బాలవీరయ్య లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా చేనేత ,జౌళి శాఖ ఏ డి కె.అప్పారావు, డిఓ లు వెంకటేశ్వర రావు, హనుమంతరావు, డివిజినల్ మార్కెటింగ్ మేనేజర్ ఎల్. రామకృష్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

 

press release