Close

పత్రిక ప్రకటన ఏలూరు, తేదీ.22.1.2022. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు.

Publish Date : 22/01/2022

పత్రిక ప్రకటన
ఏలూరు, తేదీ.22.1.2022.

సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు.

శనివారం భీమడోలు మండలంలోని చెట్టన్నపాడు గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఎంత మంది జనాభా ఉన్నారు, అందులో మహిళలు పురుషులు ఎంతమంది వంటి వివరాలు సచివాలయాల పరిధిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి పెన్షన్ లు వస్తున్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, స్పందన అర్జీల రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు, లబ్దిదారుల జాబితా తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయట ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారికి ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని సచివాలయ సిబ్బందిని ఏఎన్ఎంను ఆదేశించారు
కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలను ప్రజలంతా ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించడంతో పాటు, తరచుగా చేతులను శుభ్రపరచుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అందరికీ మోటివేషన్ చేసి వ్యాక్సినేషన్ వేయించాలని ఏఎన్ ఎం కు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేసించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు .గ్రామంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు, వెరిఫికేషన్, డేటా ఎంట్రీ ఎన్ని చేశారు వంటి వివరాలను విఆర్ ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు . సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని పైకం చెల్లించు వారికి సచివాలయాల ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు . జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నూరు శాతం విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి జగనన్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కాన్ని వేగ‌వంతం చేయాలన్నారు. సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంలో సుముఖత ఉన్న వారితో మాత్రమే పైకము తీసుకోవాలని ఎవరిని బలవంతం పెట్టవలసిన అవసరం లేదన్నారు.

పంచాయతీ సెక్రెటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డేటా ఎంట్రీ పై దృష్టి సారించేలా చేసి డేటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విఆర్వో లాగిన్ లో ఉన్న లబ్ధిదారుల జాబితాను కూడా వెంటనే అప్రూవల్ చేయాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పథకం నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా చేయాలన్నారు. అతి త‌క్కువ రుసుంతోనే, శాశ్వ‌త హ‌క్కును సంపాదించే ఈ ప‌థ‌కం క్రింద, ఎటువంటి రిజిష్ట్రేష‌న్ ఛార్జీల‌ను చెల్లించ‌న‌క్క‌ర‌లేకుండానే, త‌మ గ్రామ‌, వార్డు స‌చివాల‌యంలోనే రిజిష్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు. రిజిష్ట్రేష‌న్ అనంత‌రం త‌మ ఇంటిని లేదా స్థలాన్ని అవ‌స‌ర‌మైతే బ్యాంకులో త‌న‌ఖా పెట్టుకోవచ్చున‌ని, లేదా కొత్త‌గా రుణాన్ని తీసుకోవ‌చ్చ‌ని సూచించారు.
ఈ పధకం ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేసి ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కం అమ‌లును వేగ‌వంతం చేయాల‌ని, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఓటిఎస్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించి, దీనిని స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌ని అన్నారు. స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లు క్షేత్ర‌స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.

అనంతరం ఆగడాల లంక గ్రామంలో పర్యటించి అక్కడ ఉన్న దుకాణాలను ,రోడ్లను, శానిటేషన్ ఏవిధంగా ఉందొ కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఉన్న వారితో మాట్లాడి వారికి ప్రభుత్వం నుండి వచ్చే స్కీములు ఎవరెవరికి వచ్చాయి అని అడిగి తెలుసుకున్నారు . ఊరులో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) హిమాన్షు శుక్లా, వ్యవసాయ శాఖ అధికారులు,ఆర్ ఐ , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _
సమాచార పౌరసంబందాల శాఖ. ఏలూరు నుండి జారీ.