Close

పత్రికా ప్రకటన. భీమవరం: న‌వంబ‌రు 05,2023. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి బి ఎల్ ఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు .

Publish Date : 05/11/2023

పత్రికా ప్రకటన.

భీమవరం: న‌వంబ‌రు 05,2023.

తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి బి ఎల్ ఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు …

అదివారం పురపాలక సంఘం పరిధిలో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాల, రూరల్ గ్రామం గొల్లవానితిప్ప గ్రామంలో ఏర్పాటుచేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్బిలో భాగంగా జరుగుతున్న స్పెషల్ కాంపెయిన్ ను జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. ఓటర్ల జాబితాలను పరిశీలించి బి.ఎల్.ఓలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగు సమయంలో ఓటర్ల జాబితాలకు పూర్తి బాధ్యత బి.ఎల్.ఓ లదేనని తెలిపారు. జాబితాలో అక్కడక్కడ ఫోటో లు లేకుండా ఉన్న ఓటర్ల ను గమనించి ఫోటోలను తప్పకుండా అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు. ఫారం 6 , ఫారం 8 లు ఎన్నెన్ని వచ్చాయి ఎలా పరిష్కరించారని జిల్లా కలెక్టరు ప్రశ్నించారు. 100 ఏళ్ళు దాటినా వారు ఎంత మంది ఉన్నారని ఆమె అడిగారు. డెత్ ఓటర్లు డూప్లికేషన్లు లేకుండా చూడాలని, స్పెషల్ కాంపెయిన్ తర్వాత ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాల క్రాస్ చెక్ చేసి చూడాలని అన్నారు. ఇరు పార్టీల బి.ఎల్.వో లతో మాట్లాడి స్పెషల్ కాంపెయిన్ ఎలా జరుగుతుందని అడిగారు. అర్హులైన వారందరిని ఓటర్లు గా చేర్పించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి కోరారు.

జిల్లా కలెక్టరు వెంట భీమవరం నియోజక వర్గం ఇఅర్వో, ఆర్డీవో కె శ్రీనివాసులు రాజు, తహశీల్దారు వై రవికుమార్, బిఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ. భీమవరం నుండి జారీ చేయడమైనది.