Close

పత్రికా ప్రకటన. భీమవరం: నవంబరు 06,23. స్పందన దరఖాస్తులకు ఖచ్చితమైన పరిష్కారం చూపాలి డి ఆర్ ఓ కె . కృష్ణవేణి

Publish Date : 06/11/2023

పత్రికా ప్రకటన.

భీమవరం: నవంబరు 06,23.

స్పందన దరఖాస్తులకు ఖచ్చితమైన పరిష్కారం చూపాలి డి ఆర్ ఓ కె . కృష్ణవేణి

సోమవారం స్థానిక కలెక్టరేటు స్పందన సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన దరఖాస్తులను జిల్లా రెవిన్యూ అధికారి శ్రీమతి కె.కృష్ణవేణి
మరియు కె ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి ఎస్ నారాయణరెడ్డి, పిడి హౌసింగ్ డాక్టర్ ఆర్ సి ఆనంద్ కుమార్, పి డి డి ఆర్ డి ఏ ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, సీ.ఐ జి.వి.ఎస్ పైడేశ్వరరావు, దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా డి ఆర్ ఓ కృష్ణవేణి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు మళ్లీ రీ ఓపెన్ అవ్వని విధంగా ఖచ్చితమైన పరిష్కారం చూపాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి మన మీద నమ్మకంతో వారి సమస్యల పరిష్కారానికి వస్తారని ఆమె అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన చక్కని పరిష్కారం అర్జీదారులకు చూపాలని డి ఆర్ ఓ కె . కృష్ణవేణి అధికారులను ఆదేశించారు.

ఈరోజు స్పందన కార్యక్రమం ద్వారా 224, ఫిర్యాదులు స్వీకరించడం జరిగినది వాటిలో వచ్చిన ఫిర్యాదులు కొన్ని విధంగా ఉన్నాయి.

*ఆచంట మండలం పెనుమంచిలి గ్రామంలో ప్రభుత్వ పుంతను ఆక్రమించుకుని పాకలు, బడ్డీలు వేసి పంట పొలాలకు సంబంధించిన వరి మసులు చేసుకోకుండా కొంతమంది ఆటంకాలు కల్పిస్తున్నారని మన్నే అన్నపూర్ణ లక్ష్మి, ఫిర్యాదు చేశారు.

*పోడూరు మండలం పెనుమదం గ్రామం చాకలి వారి వీధి నుండి ఎం. సత్యవతి ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొన్నారు తనకు 21 సెంట్లు భూమి ఉన్నది. తన భూమిని భర్త అన్నగారి కుమారుడు ఆక్రమించుకున్నారు అడుగుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారు న్యాయం చేయాలని కోరారు.

*పెనుగొండ మండలం తమ్మరాడ గ్రామంలో తన భూమికి సంబంధించిన సర్వే రాళ్లను తొలగించి ఆర్ అండ్ బి అధికారులు పంట బోధిని పూడ్చివేసి కొబ్బరి చెట్లను తొలగించారు,న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధులు ట్రిబ్యునల్ మెంబరు మేళం దుర్గా ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.