Close

పత్రికా ప్రకటన భీమవరం: నవంబర్ 5,2023 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు హైజిన్ కిట్స్ పంపిణీ.

Publish Date : 05/11/2023

పత్రికా ప్రకటన

భీమవరం: నవంబర్ 5,2023

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు హైజిన్ కిట్స్ పంపిణీ..

జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు.

ఆదివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు హైజిన్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఐ ఆర్ సి ఎస్ ప్రెసిడెంట్ శ్రీమతి పి.ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తృతంగా చేయడం జరుగుతుందని, ఈరోజు ఏర్పాటుచేసిన కార్యక్రమం ద్వారా 375 హైజిన్ కిట్స్ ను పారిశుద్ధ పారిశుద్ధ్య కార్మికులకు, సానిటరీ ఇన్స్పెక్టర్లకు అందజేయడం జరిగిందన్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలో విపత్తులు, వర్షాలు వచ్చినప్పుడు వారి సేవలను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు వీరు మిల్లెట్లు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి ప్రాంతాల నుంచి వచ్చే అజీదారులకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఇటీవల తణుకు యానాది కుటుంబాలకు కూడా రెడ్ క్రాస్ సహాయాన్ని అందించడం జరిగింది అన్నారు. వారికి అవసరమైన బట్టలు, వంట సామాగ్రిని అందజేయడం జరిగిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరుపున యానాది కుటుంబాలకు ఆధార్ కార్డులు ఏర్పాటుచేసి, వారి పిల్లలను పాఠశాలలో చేర్పించడం కూడా జరిగిందని, వారికి ఇళ్లను కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వారిలో కొందరు ట్రై సైకిల్స్ ను అడగడం జరిగిందని, పంచాయతీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని సందర్భాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు వస్తున్నదని వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, సంస్థ నిరంత సేవలు అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.

అనంతరం పారిశుద్ధి కార్యక్రమాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు జాతీయస్థాయిలో అవార్డు పొందిన బొత్స మోషే, మరో ఏడు మందికి మెమొంటోలను అందజేసే శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. శ్రీనివాసులు రాజు, పురపాలక సంఘం కమీషనరు యం.శ్యామల, తహాశీల్దారు వై.రవి కుమార్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు డా.యం.యస్.వి శివ రామ భద్రి రాజు, సీనియర్ కో ఆర్డినేటరు యస్.మల్లేశ్వరరావు, మునిసిపల్, శానిటేషన్, వార్డు సచివాలయం, జిల్లా రెడ్ క్రాస్ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.