Close

పత్రికా ప్రకటన భీమవరం: నవంబర్ 4, 2023 ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు, తప్పు జరిగితే చర్యలు కచ్చితంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/11/2023

పత్రికా ప్రకటన

భీమవరం: నవంబర్ 4, 2023

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు, తప్పు జరిగితే చర్యలు కచ్చితంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం రాత్రి స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్స్ తో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గన్ని బ్యాగులుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ప్రణాళికను సిద్ధం చేసుకుని రైతులకు అందజేయాలన్నారు. రైతులు పంట కోసిన తర్వాత నిర్ణీత కాలవ్యవధిలో మాత్రమే గన్ని బ్యాగులను అందజేయాలన్నారు. ఆర్బికేలవారీగా గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని, గన్ని బ్యాగుల విషయంలో మిల్లర్స్ కూడా సహకారం అందించాలని కోరారు. ఎఫ్ ఎ క్యూ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎఫ్ ఎ క్యూ నిబంధనలను తప్పక పాటించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ సీజన్లో రూ.460 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు అవసరమని, దీనిలో రూ.100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలను సోమవారం నాటికి అందజేయాలని రైస్ మిల్లర్ అధ్యక్షులను కోరడం జరిగింది. ధాన్యం రవాణా చేసేందుకు ఇప్పటివరకు 1,428 వాహనాలకు జిపిఎస్ అమర్చడం జరిగిందని తెలిపారు. ఆర్బికేలు వారీగా అవసరమైన వాహనాలు వివరాలను వీఆర్వో వెంటనే సమర్పించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులలో అవగాహన కలిగించేందుకు రూపొందించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోను వాట్సప్ ద్వారా పంపడంతో పాటు, ఆర్.బి.కెలలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివలన రైతులలో అవగాహన ఏర్పడి ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు. ధాన్యం అన్లోడ్ సమయంలో కస్టోడియన్ అధికారి తప్పనిసరిగా అక్కడ ఉండాలని ఆదేశించారు. ఏదన్నా సమస్యల పరిష్కారానికి, ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఆర్డీవోలు చొరవ చూపాలన్నారు. గత సీజన్ సిఎంఆర్ ను వెంటనే పూర్తి చేయాలని మిల్లర్లను కోరారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఎప్పటికప్పుడు తాసిల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఆర్డీవోలు, వ్యవసాయ శాఖ ఏడీలు మండల స్థాయిలో ధాన్యం కొనుగోలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ధాన్యం రవాణా వాహనాల రాకపోకలను పక్కాగా సమీక్షించడంతోపాటు, ఓకే మిల్లు దగ్గర నిలిచిపోకుండా, వేరే మిల్లుకు తరలించేలా సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 314 ఆర్.బి.కెలలో దాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్ రకం 100 కేజీలు రూ.2,203/- లు, 75 కేజీలు రూ.1,652/-, 40 కేజీలు రూ.881/- లు, కామన్ వెరైటీ రూ.2,183/- లు, రూ.1,637/- లు, రూ.873/- లు ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి, నరసాపురం ఆర్టీవో యం అచ్యుత అంబరీష్, తాడేపల్లిగూడెం ఆర్డీవో కె చెన్నయ్య,భీమవరం ఆర్డీవో కె శ్రీనివాసులు రాజు, డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, డియల్డివో కెసిహెచ్ అప్పారావు, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజరు టి శివరామ ప్రసాదు, డియస్ వో యన్ సరోజ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వర రావు, జిల్లా రవాణా శాఖ టి ఉమా మహేశ్వర రావు, జిల్లా రైసు మిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ. భీమవరం నుండి జారీ చేయడమైనది.