Close

పత్రికా ప్రకటన భీమవరం: నవంబరు 4,2023. జిల్లాలో జే.ఎ.ఏస్ క్యాంపుల ద్వారా నమోదైన శుక్లాల ఆపరేషన్లను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డిని కోరారు.

Publish Date : 04/11/2023

పత్రికా ప్రకటన

భీమవరం: నవంబరు 4,2023.

జిల్లాలో జే.ఎ.ఏస్ క్యాంపుల ద్వారా నమోదైన శుక్లాల ఆపరేషన్లను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డిని కోరారు.

శనివారం విజయవాడ సిఎస్ కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, మహిళా శిశు సంక్షేమం, విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్, బాల్య వివాహాల నివారణ, నాడు నేడు, జగనన్నకు చెబుదాం అంశాలపై వివిధ కార్యదర్శులతో కలిసి కలెక్టర్లు, జేసీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి హాజరయ్యారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పటిష్టంగా నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో చికిత్సలు మరియు మరింత మెరుగైన వైద్య సేవలు కొరకు రికమెండ్ చేసిన రిఫరల్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ లో చికిత్స అందించే వరకు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించారు. నవంబర్ 10 లోపు ఆరోగ్యశ్రీ ఈకేవైసీ ని పూర్తి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలలో మలేరియా మరియు డెంగ్యూ కేసులపై దృష్టి పెట్టాలి. హై రిస్క్ గర్భవతులకు సకాలంలో వైద్య సేవలు అందాలి. రక్తహీనత బాలింతలను, పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందజేయాలి. విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ లో భాగంగా పదవ తరగతి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారిని తప్పనిసరిగా రీ ఎన్రోల్ చేయించేందుకు కృషి చేయాలన్నారు. నవంబర్ 15 నుంచి చేపట్టే భారత సంకల్ప యాత్ర విజయవంతానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాస్థాయిలో సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని, అలాగే మున్సిపల్ కమిషనర్ మరియు ఎంపీడీవో ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పట్టణ, మండల స్థాయిలో కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగన్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ద్వారా శుక్రవారం ఆపరేషన్లకు సుమారు 2,586 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. అవసరమైన వారికి శుక్లాల ఆపరేషన్లు చేస్తున్న తరువాత కూడా ఇంత పెద్ద మొత్తంలో నమోదు కావడం జరిగింది అన్నారు. తాడేపల్లిగూడెం, తణుకు లలో మాత్రమే రెండు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయని, పాలకొల్లు లైన్స్ క్లబ్ కంట్రోల్ లో ఉన్న హాస్పిటల్స్ నుండి కూడా సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది పేషెంట్స్ ఉండటం వలన సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామన్నారు. జనవరి 2024 వరకు షెడ్యూల్ చేసిన టైం సరిపోని కారణంగా నెట్వర్క్ హాస్పిటల్స్ నుండి సపోర్ట్ కోరడమైనదని తెలిపారు. వారికి రిఫర్ హాస్పిటల్ యాజమాన్యం జాప్యం చేస్తున్నాయన్నారని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి జిల్లా కలెక్టర్ వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, డియల్డివో కెసిహెచ్ అప్పారావు, జిల్లా విద్యా శాఖ అధికారి ఆర్ వెంకట రమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వర రావు, జిల్లాపంచాయతీ శాఖ అధికారి జివికె మల్లిఖార్జున రావుజిల్లా, సిపివో బి శ్రీనివాస రావు, ఐసిడియస్ అధికారి బి సుజాతా రాణి, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగు శాఖ అధికారి శ్రీనివాస రావు, ఆర్డబ్ల్యూయస్ అధికారి ఎ రామ స్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. డి మహేశ్వర రావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి భాను నాయక్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరు డా. కీర్తి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.