Close

పత్రికా ప్రకటన. భీమవరం: నవంబరు 04, 2023. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో పక్కాగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/11/2023

పత్రికా ప్రకటన.

భీమవరం: నవంబరు 04, 2023.

సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో పక్కాగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎలక్షన్, రీ సర్వే, దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేయాలని ఆమె అన్నారు. ఎన్నికల నిబంధనలో అనుగుణంగా వీఆర్వో ఎన్ఎక్సర్ 1 లో ఉన్న కొన్ని ఫార్మేట్లను వారి పరిధిలో ఉన్న పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, లేబర్, పంచాయతీరాజ్ శాఖలను సమన్వయం చేసుకుంటూ గత ఎన్నికల్లో జరిగిన రికార్డులను పరిశీలించి పూర్తి చేయవలసి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫార్మేట్ లు రెండు రోజుల్లో పూర్తి చేసి జిల్లా కార్యాలయంకు పంపాలన్నారు. వాటి ఆధారంగా సెక్టార్ ఆఫీసర్లను, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లను నియమించడం జరుగుతుందని, అలాగే సెక్టార్లవారీగా ఎలక్షన్ బృందంను కూడా నియమించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఫార్మేట్ లలో పూర్తి చేయాల్సిన వివరాలను అంశాల వారీగా ఆమె సంబంధిత అధికారులకు వివరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు, వార్డులను గుర్తించి ఒక నివేదికను తయారు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓటర్లను ఓట్ల కోసం ప్రలోభ పెట్టే కార్యక్రమాలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లను సంరక్షించుకోవడం మన ప్రధాన బాధ్యతని ఆమె అన్నారు. గత సార్వత్రిక ఎన్నికలు, స్థానిక ఎన్నికలు లో జరిగిన వాటిలో ముఖ్యంగా ఇరు వర్గాల మధ్య గొడవలు, ఎలక్షన్ల సమయంలో ఎస్ ఐ ఆర్ ఫైల్ చేసిన పోలీసు కేసులు, ప్రొఫెషన్ కేసులు, డ్రగ్, నగదు, బహుమతులు ఓటర్లను ప్రలోభ పెట్టిన కేసులు, ఎన్సిసి రికార్డులో ఉన్న తగాదాలు, నగదు సీజ్ చేసిన కేసులు తదితర అంశాలపై రికార్డులను పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా 90 శాతం కంటే ఎక్కువ పోలైన ఓటర్ల లిస్టు, 10 శాతం కంటే తక్కువ పోలైన లిస్టు, రీపోలు అయిన నియోజక వర్గాలు వారీగా లిస్టును సిద్ధం చేసి మంగళవారం సాయంత్రం కల్లా జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. సంబంధిత ఆర్డీవోలు పోలింగు సామాగ్రి నిల్వ ఉంచేందుకు స్టోరేజ్ పాయింట్లు, డిస్ట్రిబ్యూషన్, ట్రైనింగ్ నిర్వహణకు వీలుగా ఉండే భవనాలను గుర్తించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నివేదికను సోమవారం కల్లా అందజేయా లన్నారు. స్ట్రాంగు రూమ్ లు , కౌంటింగు పాయింట్లు రెండు తప్పనిసరిగా ఒకే సముదాయంలో ఉండేలా చూసి, ఎలాంటి సమస్యలు తలెత్తని వాతావరణంలో ఉండేలా చూడాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సిద్ధం కండి ..

ఈనెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నందున ఏ మండలంలో కార్యక్రమం ఏర్పాటుచేసిన అధికారులు సిద్ధంగా ఉండేలా కార్యచరణ రూపొందించు కోవాలన్నారు. లంక ల్యాండ్స్, అసైన్ ల్యాండ్లు, బరియల్ గ్రౌండ్స్ తదితర భూములు సంబంధించిన రికార్డులను పునః పరిశీలించు కోవాలన్నారు. యలమంచిలి, ఆచంట, పెనుగొండ మండలాలు గోదావరి లంక భూములు సంబంధించి 818 ఎకరాలు “సి” క్లాసు నుండి “బి” క్లాసుకు మార్చి 1,174 మందికి పట్టాలు మంజూరు చేయటానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా సంబంధిత ఆర్డిఓ, మండల అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.

రీ సర్వే ప్రక్రియ పక్కల నిర్వహించాలి..

రీ సర్వే ప్రక్రియకు హాజరుకాని రైతులకు నోటీసులు పంపాలని వారి సమక్షంలోనే రీ సర్వే జరగాలన్నారు. రీ సర్వే చేయడం వలన ఉపయోగాల గురించి రైతులకు పూర్తి అవగాహన కలిగేలా వివరించాలన్నారు. రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, రీ సర్వే కు రైతులు పూర్తిగా సహకరించేలా అధికారులు, సిబ్బంది స్నేహా పూరిత వాతా వరణంలో పని చేసి, నవంబరు 30 వ తేదీ నాటికి మూడవ దశ రీ సర్వే పూర్తి చేయాలన్నారు.

దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు అవసరం..

దీపావళి మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్దేశించిన నియమ నిబంధనలను అనుగుణంగా మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలదారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడు ఆర్డీవో రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు, ముందస్తుగా నీరు, ఇసుక వంటివి ఆయా కేంద్రాలలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఫైర్ అలారం సిస్టం ఏర్పాటుతో పాటు, అత్యవసర పరిస్థితిలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించేలా ఆయా కేంద్రాల వారికి అవగాహన కలిగించాలన్నారు. మందు గుండు విక్రయ కేంద్రాలు అనుమతించిన ప్రదేశంలోనే ఏర్పాటుచేయాలని, నివాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ దుకాణంనకు 3 మీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలని, ప్రతీ దుకాణం వద్ద దుకాణాదారులు రెండు అగ్ని నిరోధక సిలెండర్లు, రెండు బకెట్లతో పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకునేలా చూడాలన్నారు. తయారీ కేంద్రాలు, స్టాకు పాయింట్లు, అమ్మకం దుకాణాలు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తించే సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విక్రయ దుకాణాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అనువైన ప్రాంతాలలో దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా యస్పి యు రవి ప్రకాష్, జిల్లా జాయింటు కలెక్టరు ఎస్ రామ్ సుందర్ రెడ్డి, నరసాపురం ఆర్టీవో యం అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టర్లు రాగడ మణి, బియస్ యన్ రెడ్డి ,డిప్యూటీ ట్రైనీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజరు టి శివరామ ప్రసాదు, డియస్ వో యన్ సరోజ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వర రావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. డి మహేశ్వర రావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి డా. ఆర్సి ఆనంద్ కుమార్, డిఆర్డిఏ పిడి యం యస్ యస్ వేణుగోపాల్, జిల్లా సర్వే అధికారి కె జాషువా, ఏయస్ వో యం రవి శంకర్, డ్వామా పిడి యస్టివి రాజేశ్వర రావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డా. రాబద్రి రాజు,ఎస్వీ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ. భీమవరం నుండి జారీ చేయడమైనది.