Close

పత్రికా ప్రకటన భీమవరం: నవంబర్ 3,2023 సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

Publish Date : 03/11/2023

పత్రికా ప్రకటన

భీమవరం: నవంబర్ 3,2023

సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  స్థానిక కలెక్టరేట్ విసి హల్ నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో మూడు విభాగాలతో కూడిన రక్షణ దళాలను ఉపయోగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇదే విధంగా రక్షణ దళాలను ఏర్పాటు చేయడం తో పాటు, మరో నాలుగు విభాగాలను కూడా రక్షణ దళాల సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. 2019లో జరిగిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆమె వివరించారు. 782 మంది రక్షణ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహణకు కొరతను జిల్లా ఎస్పీ గుర్తించారని, వారి స్థానంలో రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ లు, ఎన్ సి సి, మహిళా పోలీస్ తదితరుల సేవలను ఉపయోగించుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని ఆమె వివరించారు. 434 సెక్యూరిటీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, పోలింగ్ కు సంబంధించి 392 వాహనాలకు ప్రతిపాదించగా ఇంతవరకు మాకు అందుబాటులో ఉన్న వాహనాలు పూర్తి వివరాలతో కూడిన నివేదిక త్వరలోనే సమర్పిస్తామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్నేహపూరిత వాతావరణం లో ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని, వాటికి అనుగుణంగా సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఉండే భవనాలను గుర్తించడం జరిగిందని, వాటిలో ఎక్కువ శాతం పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. నవంబర్ 4 , 5 శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను ఫారం 6, తొలగింపులకు ఫారం 7, మార్పులు, చేర్పులకు ఫారం 8 లను స్వీకరించడం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…..,………………………………………

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.