పత్రికా ప్రకటన, భీమవరం ,తేదీ21.10.2022. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతర శ్రమజీవి పోలీసులే * త్యాగాలకు ప్రతీక పోలీసు అమరవీరుల దినోత్సవం .. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్

పత్రికా ప్రకటన,
భీమవరం ,తేదీ21.10.2022.
శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతర శ్రమజీవి పోలీసులే
* త్యాగాలకు ప్రతీక పోలీసు అమరవీరుల దినోత్సవం .. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్
ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారని .. వారు నిరంతర శ్రమజీవి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు.
భీమవరం శ్రీవిష్ణు విద్యాసంస్థల ఆవరణలో పోలీసు అమరవీరుల స్మృతి దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళిలర్పించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ స్వేచ్చా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులేనని, అంతటి నిస్వార్థమైన అంకితభావంతో కూడిన సేవలందిస్తున్నారని అన్నారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేస్తున్న త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యతని అన్నారు. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడమే ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ మాట్లాడుతూ దేశ రక్షణకు సైనికుడు ఎంత అవసరమో సమాజ రక్షణకి పోలీసులు అంత అవసరమని, ప్రతీ నిమిషం ఒత్తిడిని భరిస్తూ క్షణ క్షణం అంకిత భావంతో ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులలో ప్రాణాలర్పించిన నిజమైన త్యాగజీవులు పోలీసు అమరవీరులేనని అన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 264మంది ప్రాణాలను కోల్పోయారని ఆయన తెలిపారు. అమరజీవులందరికి నివాళిలర్పించారు.
అనంతరం పొలిసులందరూ ర్యాలీ నిర్వహించారు.