పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4, 2023 పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ /యస్.టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

పత్రికా ప్రకటన
భీమవరం: జూలై 4, 2023
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ /యస్.టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతిని ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీమతి జిల్లెల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ చీకటమిల్లి మంగరాజు, తెన్నేటి జగజ్జివన రావు, సింగం త్రిమూర్తులు, సిహెచ్ వి.ఆర్ భరత్, తోటకూర వెంకట సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను, పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి దళితులపై ఏటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలన్నారు. దళితులకు అండగా ఉండి వారికి జరిగే అన్యాయాలపై పోరాడి ప్రభుత్వం దృష్టికి తేవాలని ఆమె అన్నారు. ఇంకా దళితులకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి సభ్యులతో చర్చించడం జరిగింది.
…………………………………….
జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.