పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4,2023 ఏరియా ఆసుపత్రులలో నూరు శాతం డెలివరీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత సూపరింటెండెంట్స్ ను ఆదేశించారు.

పత్రికా ప్రకటన
భీమవరం: జూలై 4,2023
ఏరియా ఆసుపత్రులలో నూరు శాతం డెలివరీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత సూపరింటెండెంట్స్ ను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి వైద్య శాఖ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ లో నూరు శాతం ప్రసవాలు జరిగేలా సంబంధిత సూపరింటెండెంట్లు కృషి చేయాలని ఆదేశించారు. కొన్ని ఏరియా హాస్పిటల్ లో హెచ్.డి.ఎస్ నిధులు వినియోగం తక్కువగా ఉందని, నిధులు ఖర్చు చేసి హాస్పిటల్స్ కు అవసరమైన పరికరాలు, ఇతరత్రా సమకూర్చుకోవాలన్నారు. తణుకు ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏరియా హాస్పిటల్ కు సంబంధించి లాబ్స్ కంప్లీట్ అయ్యాయా, థైరాయిడ్ పరీక్షలకు అవసరమైన ఎక్విప్మెంట్ ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి తదితర విషయాలపై సమీక్షించారు. ఏరియా హాస్పిటల్ లో సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉందా, వాటికి బ్లడ్ యూనిట్స్ ఎక్కడి నుంచి సరఫరా జరుగుతుంది ఎన్ని యూనిట్లు సామర్థ్యం ఉంది అని ప్రశ్నించారు. 35 యూనిట్లు సామర్థ్యం కలిగిన బ్లడ్ బ్యాంక్ లు ఉన్నాయని సంబంధిత ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తెలిపారు. వైద్యులు మరింత మెరుగైన సేవలు అందించినప్పుడే ఆ ఏరియా ఆసుపత్రికి ప్రజలలో మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో డిఎంహెచ్వో డి.మహేశ్వరరావు, డి సి హెచ్ ఎస్ వీరస్వామి, డి ఐ ఓ శ్రీమతి దేవసుధ, సిహెచ్సిఎస్ లు, ఏరియా హాస్పిటల్స్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………
జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.