Close

పత్రికా ప్రకటన భీమవరం: జూలై 4,2023 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అఘాయిత్యాలు, నేరాలు నిరోధించేందుకు సంబంధిత అధికారులు, సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి తెలిపారు

Publish Date : 04/07/2023

పత్రికా ప్రకటన

భీమవరం: జూలై 4,2023

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అఘాయిత్యాలు, నేరాలు నిరోధించేందుకు సంబంధిత అధికారులు, సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి తెలిపారు

మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో పౌర హక్కుల రక్షణ (PCR) మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అట్రాసిటీల నిరోధక (POA) చట్టాల అమలు తీరుపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ల రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలు నూరు శాతం అమలు జరగాలన్నారు. సంబంధిత వర్గాలకు సంబంధించిన కేసులు విషయంలో అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత వర్గాల ప్రజల నుండి మా కేసులను పట్టించుకోవడం లేదు, సరైన న్యాయం జరగడం లేదు అనే ఫిర్యాదులు రాకుండా సంబంధిత అధికారులు కచ్చితత్వంతో పని చేయాలన్నారు. కమిటీ సభ్యులు వారి సంక్షేమానికి విశేష కృషి చేయడంతో పాటు, లోటుపాట్లను గుర్తిస్తే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కమిటీ సభ్యులను కోరారు.

జిల్లాల విభజన నాటి నుండి నేటి వరకు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అట్రాసిటీల నిరోధక (POA) చట్టం కింద 142 కేసులను నమోదు చేయడం జరిగింది. వాటిలో మూడు మర్డర్ కేసులు, 12 అఘాయిత్యాల కేసులు, ఇతరత్రా కారణాలకు సంబంధించి 127 కేసులు నమోదు కావడం జరిగింది. నమోదు కావడం జరిగింది. 127 కేసీఆర్ కు సంబంధించి 83 కేసులకు ఎఫ్ఐఆర్ స్టేజిలో రూ. 37,45,000/- ను, 22 కేసులకు సిఎస్ స్టేజిలో రూ.20,50,000/- లును కలిపి మొత్తం రూ.57,95,000/- లను బాధితులకు మంజూరు చేయడం జరిగింది.

శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ మహిళ పై అగత్యాలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సందేశాన్ని ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

అడిషనల్ ఎస్పీ ఎ.వి సుబ్బరాజు సుబ్బరాజు మాట్లాడుతూ వివిధ విభిన్న కారణాలతో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ముందుగా ప్రేమించుకోవడం తర్వాత వద్దనడం, తల్లిదండ్రులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడం వారి పిల్లలు పెద్దవారి సంరక్షణలో ఉండడం తదితర కారణాలుగా ఉన్నాయన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వెళ్లిన వారి పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం ఉందని తెలిపారు.

భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం డివిజన్ల పరిధిలో నమోదైన కేసుల స్థితిగతులను సంబంధిత ఎస్డిపిఓలు సమావేశంలో వివరించడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో కేసులు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వారు కమిటీకి తెలియజేయడం జరిగింది.

కమిటీ సభ్యులు శ్రీమతి జిల్లెల సత్య సుధామ, పొన్నమండ బాలకృష్ణ, డాక్టర్ సీఎం మంగరాజు, తెన్నేటి జగజ్జివన రావు, సింగం త్రిమూర్తులు, సిహెచ్ వి.ఆర్ భరత్, తోటకూర వెంకట సుబ్బరాజు మాట్లాడుతూ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. బాధితులకు అందాల్సిన పరిహారం ఇంకా అందలేదని, వెంటనే అందజేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. భూ వివాదాలకు సంబంధించిన కేసులలో సరైన పరిష్కారాన్ని చూపాలన్నారు. కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర రుణమాఫీలు లాగానే ఎస్.సి, ఎస్.టి వర్గాలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కొంత మంది తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నారని వాటిపై విచారణ చేయాలని కోరారు. జిల్లా కేంద్రంగా అంబేద్కర్ పేరున ఏపీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో యానాదుల కుటుంబాలు సరైన వసతి, విద్య లేక కనుమరుగుతున్నాయని, అటువంటి కుటుంబాలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీమతి కె.కృష్ణవేణి, నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్య తేజభీమవరం, భీమవరం ఆర్డీవో దాసిరాజు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం ఎస్ డి పి ఓ లు బి.శ్రీనాథ్, కె.రవి మనోహరాచార్యులు, సి.శరత్ కుమార్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కే శోభారాణి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి డి.పుష్ప రాణి, జిల్లా కోపరేటివ్ ఆడిట్ కార్యాలయం డిప్యూటీ రిజిస్టార్ ఏ.అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.