పత్రికా ప్రకటన. భీమవరం: జూలై 03,2023. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని అధికార్లను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు

పత్రికా ప్రకటన.
భీమవరం: జూలై 03,2023.
అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని అధికార్లను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ఆదేశించారు …
సోమవారం జిల్లా కలెక్టరేటు స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు పరిష్కారానికి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టరు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించే విధంగా జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని కలెక్టరు అధికారులను సూచించారు. స్పందన పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదుదారునితో మాట్లాడుతున్న ఫోటో అప్ లోడ్ చేయాలని,సమస్య పరిష్కారం కాకముందు ఉన్న ఫోటో , పరిష్కారం అయిన తర్వాత ఫోటోలు అప్ లోడ్ చేయని ధర ఖాస్తు పరిష్కరించబడినదిగా పరిగ ణనలోకి తీసుకోవడం జరగదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు.
ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 259 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్ని పిర్యాదులు ఇలా ఉన్నాయి.
@ పాలకోడేరు మండలం. కుముదవవల్లి గ్రామం కట్టూ దుర్గా పార్వతి. మూడు సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్స్ కి చాలా డబ్బులు అయ్యాయి. నాకు ఆర్థిక సహాయం చేసి ఇంటి స్థలము మంజూరు చేయండి.
@ పెంటపాడు మండలం.పడమర విప్పర్రు గ్రామం. భీమాల నాగేశ్వరరావు నాకు 88 సెంట్లు పంట భూమి ఉంది. నా భూమి వెబ్ ల్యాండు నందు చేర్చి న్యాయం చేయండి.
@ భీమవరం మున్సిపాలిటీ. చిన్న రంగడిపాలెం నివాసి. జుత్తిగ పరమేశ్వర రావు. నా పొలం చుట్టూ ఆనుకుని రొయ్యల చెరువులు త్రవ్వు చున్నారు. నా పంట నాశనం అవుతుంది కనుక విచారణ చేసి న్యాయం చేయండి.
@ చీకట్ల కృప కృష్ణ ప్రసాదు పాలకొల్లు మున్సిపాలిటీ. లాక్ పేట నివాసి నా భూమికి టైటిల్ డీడ్ , పాస్ బుక్ ఇప్పించి వలసినదిగా కోరుచున్నారు.
@ నంబు సురేష్ బాబు పోడూరు మండలం. పోడూరు గ్రామం. ఆస్తి పంపకాలు, కుటుంబ తగాదాలు ఉన్నాయి. మాకు రక్షణ కల్పించి న్యాయం చేయగలరని కోరుచున్నారు.
స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి, డిఆర్ వో శ్రీమతి కె.కృష్ణ వేణి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికే మల్లి ఖార్జునరావు, జిఎస్ డబ్ల్యూఓ కెసిహెచ్ అప్పారావు, డియస్ పి.బి శ్రీనాథ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు దేవరకొండ అఖిల పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయో వృద్ధుల ట్రిబ్యునల్ మెంబరు మెళ్ళం దుర్గా ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………
జిల్లా సమాచారం శాఖ, భీమవరం నుండి జారీ .