Close

పత్రికా ప్రకటన. భీమవరం: జూన్ 30,2023. వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు విలువ కట్టలేనివి .. వైద్యులు ప్రత్యక్ష దైవం అని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు

Publish Date : 30/06/2023

పత్రికా ప్రకటన.

భీమవరం: జూన్ 30,2023.

వైద్యులు కరోనా సమయంలో చేసిన సేవలు విలువ కట్టలేనివి .. వైద్యులు ప్రత్యక్ష దైవం అని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు

శుక్రవారం కాళ్ళ మండలం పెదమిరం రాధా కృష్ణ కన్వెన్షన్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఫ్యామిలీ మీట్ సమావేశంలో జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలను జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం ముఖ్యం అని ఎంతటి భయంకరమైన వ్యాధుల్లో నుంచైనా బయటికి తీసుకువచ్చి ప్రాణాలు కాపాడ కలిగేది ఒక్క డాక్టరు కి మాత్రమే సాధ్యం అన్నారు. మరణానికి చేరువైన వారిని తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే డాక్టర్స్ సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్స్ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్నికి మంచి ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జూలై 1 తేదే న డాక్టర్స్ డే జరుపుకుంటామని, దీనిని మొదటగా 1991న జరుపుకున్నామని అప్పట్నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామన్నారు. అమ్మ మనకి జన్మనిస్తే , డాక్టర్స్ మనకి పునర్జన్మని ఇస్తారన్నారు. అలాంటి వైద్యులు మన జీవితాల్లో చాలా ముఖ్యం మని ఆమె అన్నారు. కరోనా మహమ్మారి లాంటి విపత్కర సమయంలో వైద్యుల సేవలు మరువలేనివి. తమ ప్రాణాలను లెక్కచేయకుండా మరీ పేషెంట్స్‌ ప్రాణాలను కాపాడరన్నారు వైద్యులు. సాధారణంగా ఒక రోగం తగ్గాలంటే మందులు అవసరం కానీ, దాని నుంచి పూర్తిగా కోలుకోవాలంటే వైద్యుల సేవలు సహకారం చాలా అవసరం అన్నారు. వారిచ్చే ధైర్యంతోనే పేషెంట్స్ త్వరగా కోలుకుని జనజీవన స్రవంతిలో హాయిగా ఉండగలరని జిల్లా కలెక్టరు అన్నారు.

ఈ రోజు సుమారు పట్టణ పరిసర ప్రాంతాల్లోని 200 మంది కుటుంబ సభ్యులతో డాక్టర్స్ పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున 50 సంవత్సరాలు వైద్య సేవలు అందించిన 75 సంవత్సరాలు దాటిన డాక్టర్స్ 25 మందికి వారి కుటుంబ సభ్యుల మధ్య జిల్లా కలెక్టరు ఘనంగా సన్మానించారు. వారి యోగ క్షేమాలను, సేవలను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతికి సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి.మహేశ్వర రావు, ఐ యమ్ ఏ ప్రెసిడెంటు డా జి. బాల కృష్ణ, కార్యదర్శి డా యన్ శంకర్ కుమార్ వర్మ, కల్చర్ కమిటీ చైర్మన్ ముదునూరి. గోపాల కృష్ణంరాజు, ఆశ్రమం డాక్టరు వేగిరాజు రామ కృష్ణంరాజు, డాక్టర్స్ వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ.