Close

పత్రికా ప్రకటన భీమవరం: జూన్ 28,2023 రైల్వే అండర్ బ్రిడ్జి సీపేజ్ లను వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 28/06/2023

పత్రికా ప్రకటన

భీమవరం: జూన్ 28,2023

రైల్వే అండర్ బ్రిడ్జి సీపేజ్ లను వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి భీమవరం పట్టణంలోని మూడు ఆర్.యు.బి ల సీపేజ్ లపై సంబంధిత రైల్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ యు బి లలో సీపేజ్ ల వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. వెంటనే రైల్వే అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ లతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో సీపేజ్ లను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ యు బి లు ఎప్పుడు శుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో రైల్వే ఎడిఎం ఆ శంకర్, మున్సిపల్ ఇంజనీర్ పి. త్రినాధరావు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వర్, సంబంధిత కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………..

జిల్లా సమాచారం శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.