Close

పత్రికా ప్రకటన భీమవరం: అక్టోబర్ 17, 2022 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి .ప్రశాంతి అన్నారు .

Publish Date : 17/10/2022

పత్రికా ప్రకటన

భీమవరం: అక్టోబర్ 17, 2022

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి .ప్రశాంతి అన్నారు .

సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి మాట్లాడుతూ అక్టోబర్ 27న నరసాపురం మండలం పెద్దమైనవాని లంక (పి.ఎం లంక)కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పర్యటన కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. దాదాపు రెండు గంటలు ఆర్థిక శాఖ మంత్రి కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యంగా కోస్టల్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం , డిజిటల్ భవనం పరిశీలన, మత్స్యకారుల కుటుంబాలు, డ్వాక్రా గ్రూపులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనకు అన్ని విధాల సిద్ధంగా ఉండడంతో పాటు, కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఆర్ఓ దాసి రాజు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
…………………………………………..
జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది