Close

పత్రికా ప్రకటన భీమవరం: అక్టోబర్ 17,2022 భవిష్యత్తు తరాల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో రైతు భరోసా ఒకటిగా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ తెలిపారు.

Publish Date : 17/10/2022

పత్రికా ప్రకటన

భీమవరం: అక్టోబర్ 17,2022

భవిష్యత్తు తరాల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో రైతు భరోసా ఒకటిగా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ తెలిపారు.

సోమవారం స్థానిక బి.వి రాజు కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా నాలుగో సంవత్సరం రెండో విడత నగదు జమ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి తరతరాల కోసం ఆలోచన చేసి పరిపాలన చేస్తున్నారని, అదే ఆలోచనతో రైతు మేలుకోరి రైతు భరోసాను అమలు చేయడం జరుచున్నదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఇబ్బందులను తెలుసుకున్న ముఖ్యమంత్రి రైతు భరోసా రూపంలో ఆర్థిక సాయం చేయడం జరుగుచున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు భరోసా, నవరత్నాలు కార్యక్రమాలు అమలు చేస్తూ నేరుగా లబ్ధిదారులు ఖాతాలోనే నగదు జమ అయ్యే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుందో రైతులకు తెలియపరచడం జరుగుతుందన్నారు. ఆర్బికే ద్వారా సూచనలు, సలహాలు రైతులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ధాన్యం కొనుగోలు ఇబ్బందులను గ్రహించి ఈకేవైసి ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి దళారులు, మిల్లర్లు ప్రమేయం లేకుండా ధాన్యం గిట్టుబాటు ధరకు కొనడం జరుగుతుందన్నారు. గత రెండు విడతలగా దాన్యం డబ్బులు సకాలంలో రైతుల ఖాతాలలో సాంకేతిక కారణంగా రైతులు ఖాతాల్లో జమకావడం కొంత ఆలస్యమైందన్నరు. దీనిపై ప్రత్యేక దృష్టిచారించిన ముఖ్యమంత్రి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని, ఇకనుండి ధాన్యం అమ్మిన పది రోజుల్లోనే రైతు ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి మాట్లాడుతూ రైతులకు మేలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతు భరోసాను ప్రతి సంవత్సరం ఖచ్చితమైన నెలలో అందజేయడం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి సాయంగా అక్కరకు వచ్చిందన్నారు. పొలంబడి ద్వారా రైతులలో అవగాహన పెంచడం, ఏ పంట ఎప్పుడు వెయ్యాలో సలహా తీసుకోవడానికి ఆర్పీకెలు ఉపయోగకరంగా ఉంటాయన్నరు. వ్యవసాయ సలహా మండళ్లను జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలను అమలు చేయడానికి ప్రయోజనకరంగా ఉందన్నారు. రైతులు పంటను గిట్టుబాటు ధరకు అమ్మేందుకు ఈ క్రాప్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతుల అభివృద్ధికి దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా పండిన పంటను గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహారాజు మాట్లాడుతూ రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటకు గిట్టబాటు ధర అందించడం ద్వారా ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం గా నిరూపించడం జరిగిందన్నారు. రైతులు అందరూ బాగుండాలని ఆక్వా రైతులకు కూడా నష్టం కలగని విధంగా గిట్టుబాటు ధర కల్పించేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.

రైతులు నంద్యాల సీతారామయ్య, బొక్క రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుచున్నదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా తూచా తప్పకుండా రైతు ప్రయోజనాలను జమ చేయడం ద్వారా రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో నిదర్శనం అన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2019-20 సంవత్సరంలో 1,03,659 మంది రైతులకు రూ.139.94 కోట్లు, 2020-21 సంవత్సరంలో 1,18,381మందికి రూ.159.81 కోట్లు, 2021-22 సంవత్సరంలో 1,11,509 మంది రైతులకు రూ.150.53 కోట్లు, 2022-23 సంవత్సరం మొదటి విడతగా 1,07,647 మంది రైతులకు 76.38 కోట్లు, ఈ రోజు జరిగిన రెండో విడత నిధులు విడుదల కార్యక్రమంలో 1,14,471 నంది రైతులకు 50.90 కోట్ల రూపాయలను రైతులు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.

కార్యక్రమం చివరిగా 2022-23 సంవత్సరం రైతు భరోసా నాలుగో సంవత్సరం రెండో విడతగా 1,14,471 మందికి రైతులకు రూ.50.90 కోట్ల చెక్కును రైతులకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు, సభ్యులు కొట్టు కుటుంబరావు, సివిల్ సప్లై స్ డి.ఎం టి.శివరాం ప్రసాద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె.మురళీ కృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎ.దుర్గేష్, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వీరభద్రరావు, సిపిఓ కె.శ్రీనివాసరావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………
జిల్లా సమాచారం నుండి జారీ చేయడమైనది.