Close

పత్రికా ప్రకటన. భీమవరం:నవంబరు 05,2023. చిన్నారులకు అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అన్నారు.

Publish Date : 05/11/2023

పత్రికా ప్రకటన.

భీమవరం:నవంబరు 05,2023.

చిన్నారులకు అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అన్నారు…

ఆదివారం బాలోత్సవం వేడుకలు సందర్భంగా స్థానిక చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో బాలోత్సవం పిల్లల సంబరాల పేరిట అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖన పోటీలను జిల్లా కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ చిత్రలేఖనంలో ప్రతిభ మరుగున పడకుండా ఎల్లప్పుడు అభ్యాసంనం చేస్తూ ఉండాలని, అప్పుడే సరైన మార్గంలో ప్రగతి కనపడుతుందన్నారు. బాలల్లో సృజనాత్మ కతతో పాటు నైతిక విలువలు పెంపొందించాలన్నారు. పోటీతత్వం ఉన్నప్పుడే విజయాలకు దగ్గరవుతారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల పట్ల ఈ విషయాల్లో మంచి అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యస్తుందని కేవలం విద్య వలన అభివృద్ధి సాధ్యమని అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దాతలు స్వచ్ఛంద సంస్థలు విద్యా విధానికి, విద్యార్థిని విద్యార్థులకు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు ప్రజలు మద్దతే కాదు ప్రభుత్వం గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. .ప్రఖ్యాత చిత్ర కారుడు అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖన పోటీల నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. 3 విభాగాల్లో పోటీలను జూనియర్స్ (ప్రకృతి దృశ్యం), జూనియర్స్ ( మన పండుగలు), సినియర్స్ (పర్యావరణ పరిరక్షణకై మన బాధ్యత) విభాగాల్లో పోటీలు జరపడం, గెలు పొందిన వారికి బహుమతులు ఇవ్వడం చాలా అభినందనీయం అన్నారు.

చిత్రలేఖనం ఎగ్జిబిషను పరిశీలించి ఆనందం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టరు.

ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యా ర్థులు గీచిన చిత్రలేఖనం ఎగ్జిబిషను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ప్రతి చిత్రలేఖనం పరిశీలించి ,అయా చిన్నారులు ఏమి చదువుతున్నారు, ఏ పాఠశాలలో చదువుతున్నారు అడిగి తెలుసుకుని వారిని జిల్లా కలెక్టరు అభినందించారు.

@ విద్యార్థి విద్యార్థులకు చిత్రలేఖనం చార్టు కాఫీలను జిల్లా కలెక్టరు అందజేశారు.

@ అడవి బాపిరాజు మనవరాలు కాళ్ళకూరి పద్మావతి పూల బోకేను జిల్లా కలెక్టరు అందజేసి, ఘన స్వాగతం పలికారు.

@ అడవి బాపిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె శ్రీనివాసులు రాజు, తహాశీల్దారు వై రవి కుమార్, ప్రధానోపాధ్యాయులు సి హెచ్ నిర్మలా కుమారి, బి శ్రీనివాస రావు, అడవి బాపిరాజు మనవరాలు కాళ్ళకూరి పద్మావతి, చెరుకువాడ రంగ సాయి, కంతేటి వెంకట రాజు, ఇందుకూరి ప్రసాద రాజు, వసుధ కృష్ణం రాజు, కె రామ కృష్ణం రాజు, కె శివ రామ రాజు, సాగి రాజు జానకి రామ రాజు, బి వెంకటపతి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ. భీమవరం నుండి జారీ చేయడమైనది.