Close

పత్రికా ప్రకటన. భీమవరం:నవంబరు 04,2023. గృహా నిర్మాణ శాఖలో 33 సంవత్సరాలుగా పనిచేసిన టి.ఆర్.యం గాంధీ సేవలు ఆదర్శనీయమని గృహ నిర్మాణ శాఖ పిడి డా. ఆర్సీ ఆనంద్ కుమార్ అన్నారు

Publish Date : 04/11/2023

పత్రికా ప్రకటన.

భీమవరం:నవంబరు 04,2023.

గృహా నిర్మాణ శాఖలో 33 సంవత్సరాలుగా పనిచేసిన టి.ఆర్.యం గాంధీ సేవలు ఆదర్శనీయమని గృహ నిర్మాణ శాఖ పిడి డా. ఆర్సీ ఆనంద్ కుమార్ అన్నారు …

స్థానిక పురపాలక సంఘం కౌన్సిలు సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి జిల్లా గృహా నిర్మాణ సహాయక మేనేజరు టిఆర్ యం గాంధీ పదవి విరమణ సన్మాన కార్యక్రమం గృహ నిర్మాణ శాఖ పిడి డా. ఆర్ సి ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గాంధీ దంపతులను గజమాల, శాలువా కప్పి, జ్ఞాపి కలతో ఘనంగా గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సన్మానించారు. ఈ సంధర్భంగా గృహ నిర్మాణ శాఖ పిడి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని కాని సర్వీసులో మంచి సేవలు అందించినప్పుడే వారికి సంతృప్తి, జూనియర్స్ వారి సేవలను ఆదర్శంగా తీసుకుని మంచి సేవలు అందించుటకు మంచి అవకాశం కలుగుతుందన్నారు. 33 సర్వీసులో ఎప్పుడు చిరునవ్వుతోనే విధులు నిర్వహించేవారని, ఎంత పని ఉన్నను పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళేవారన్నారు. చక్కని సేవలు అందించిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతర కాలంలో కూడా గౌరవం ఉంటుందన్నారు. సర్వీసులో చేసిన మంచి సేవలు, అనుభవాలు శేష జీవితంలో తీపిగుర్తులుగా మిగిలి పోతాయన్నారు. మహాత్మా గాంధీజీ పుట్టిన రోజునే జన్మించుట వారి తల్లిదండ్రులు వీరికి గాంధీ అని నామకరణం చేయడం వారి తల్లిదండ్రులు తీసుకున్న గొప్ప నిర్ణయం అని, మిగిలిన జీవితం సుఖ సంతోషాలతో జీవించాలని గృహ నిర్మాణ శాఖ పిడి డా. ఆర్సీ ఆనంద్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇ ఇ బి వెంకట రమణ, డిఇ లు జి పిచ్చయ్య, పి శివరామరాజు, సహాయక ఇంజ నీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.