Close

పత్రికా ప్రకటన. భీమవరం:జూలై 03,2023. జగనన్న సురక్ష కార్యక్రమం ప్రత్యేక క్యాంపులను మరింత సంవర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు..

Publish Date : 03/07/2023

పత్రికా ప్రకటన.

భీమవరం:జూలై 03,2023.

జగనన్న సురక్ష కార్యక్రమం ప్రత్యేక క్యాంపులను మరింత సంవర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు…

సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి, జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి జగనన్న సురక్ష, గృహానిర్మాణం, మనబడి – నాడు నేడు, జగనన్నకు చెబుదాం, జాతీయ ఉపాధి హామీ పనులు, జలకళ తదితర అంశాలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్న సురక్ష ప్రత్యేక క్యాంపులలో ఎన్ని టోకెన్లు ఇచ్ఛారు, వాటి ప్రకారం ప్రజలకు వివిధ ధ్రువపత్రాలు అందజేశారా, వాటిని ఆన్లైన్ లో నమోదు చేశారా మండలాలు, మునిసిపాలిటీ వారీగా జిల్లా కలెక్టరు సమిక్షించారు. ప్రత్యేక క్యాంపులలో హెల్ప్ డెస్క్, వైద్య శిబిరం, చిన్నపిల్లలకు ఆధార్ నమోదు కేంద్రం తదితర మౌలిక సదుపాయాలను కల్పించి ఏ ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలన్నారు. చిన్నపిల్లల అధారు నమోదు కేంద్రంలో రోజుకు ఎంతకు నమోదు చేశారు ఆ ధృవపత్రాలు త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకుని ఎన్ని ఇచ్చారో కూడా ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. జగనన్నకు చెబుదాంలో వచ్చిన ప్రతి పిర్యా దును అత్యంత బాధ్యతగా వ్యవహరించి పరిష్కారం చూపాలన్నారు. గత నెలలో జరిగిన లోటుపాట్లును అంచనా వేసుకుని ఈ నెలలో పగడ్బందీగా ఒక్క పొరపాటు జరగకుండా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. గృహనిర్మాణం, జాతీయ ఉపాధిహామీ పనులు, జలకళ, మనబడి నాడు -నేడు పనులను మండలాలు, పురపాలక సంఘాలు వారిగా, ప్రతి గ్రామం, ప్రతి వార్డు పనుల ప్రగతిని జిల్లా కలెక్టరు శ్రీమతి ప్రశాంతి సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీమతి కె.కృష్ణ వేణి, సబ్ కలెక్టరు యం.సూర్య తేజ, డియల్డివో కె.సి.హెచ్ అప్పారావు, జిల్లాలోని వివిధ శాఖలు అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ.