Close

పత్రికా ప్రకటన. భీమవరం:జూలై 01,2023. ప్రజలు కోరిన ధృవ పత్రాలు అందించి జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు…

Publish Date : 01/07/2023

పత్రికా ప్రకటన.

భీమవరం:జూలై 01,2023.

ప్రజలు కోరిన ధృవ పత్రాలు అందించి జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు…

శనివారం ఉండి మండలం పాందువ్య గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం ప్రత్యేక క్యాంపుకు జిల్లా కలెక్టరు ఆకస్మికంగా సందర్శించారు. తొలి రోజు కార్య క్రమంలో ఒక చిన్న గ్రామంలో 350 ధృవ పత్రాలను అందించడం పట్ల జిల్లా కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆయా పథకాలు అమలు చేయడం, వారికి కావలసిన వివిధ ధృవ పత్రాలను అందించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శాఖల మధ్య సమన్వయం ఉన్నపుడే ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతాయన్నారు. అర్హత ఉండి పధకం అందని లబ్దిదారులు ఉండకూడదని, పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నాణ్యతగా సర్వీస్ ఇవ్వడం అత్యంత ముఖ్యమని నిబంధనలు పాటించి ప్రజలు అడిగిన సర్వీసుకు ఖచ్చితంగా పరిష్కారం చూపించాలన్నారు. సర్వీసులు అన్ని ఉచితంగా అందించడం జరుగుతుందని, సచివాలయాల పరిధిలో ఒక్క ఇల్లు వదలకుండా చూడాలన్నారు. నెల రోజుల పాటు జిల్లాలో జరిగే ప్రత్యేక క్యాంపులు విజయవంతం చేసేందుకు అధికారులు ప్రతి రోజు ప్రత్యేక దృష్టి తీసుకోవాలన్నారు. ప్రత్కేక క్యాంపులలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్నేహపూరిత వాతావరణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు అన్నారు.

పసిపిల్లలకు ప్రత్కేక అధారు నమోదు సెంటరు, హెల్ప్ డెస్క, ప్రధమ చికిత్స కేంద్రాలు, తదితర ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరు అధికారులను, సిబ్బందిని అభినందించారు.

అనంతరం ప్రజలకు ధృవ పత్రాలను అందించి, వారి యోగ క్షేమాలను జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డి సి వో యం రవికుమార్, ఇంచార్చి తహశీల్దారు యస్ వి యస్ నాయుడు, యం పి డి వో ఏ వెంకట అప్పారావు, వివిధ శాఖలు అధికారులు, గ్రామ సర్పంచి యామిని ప్రియాంక, గ్రామ నాయకులు,సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ.