Close

పత్రికా ప్రకటన, బుట్టాయిగూడెం, 9.8.2021. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందించడం జరుగు తోంది అని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.

Publish Date : 09/08/2021

పత్రికా ప్రకటన, బుట్టాయిగూడెం, 9.8.2021. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందించడం జరుగు తోంది అని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు.
సోమవారం
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో భాగంగా
బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్ర పురం ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ము లో
మిగతా ఐటీడీఎ కన్నా కోట రామ చంద్రపురం ఐటీడీఎ ను సమగ్ర అభివృద్ధి చేసే విషయం లో ఇక్కడి ప్రత్యేక పరిస్థితి మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని నిరంత రం ప్రభుత్వం ఆలోచనలకు అను గుణంగా ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరం కృషి చేస్తూ, ఇక్కడి ప్రజల అవస రాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక శాసనస భ్యులు సూచనలు చేస్తున్నార న్నారు. ఇటువంటి నిబద్ధత కలిగిన ప్రజా ప్రతినిధి తో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చెయ్యడం తృప్తి నిస్తోంద న్నారు. ఐ టి డి ఏ పరిధిలో రైతు భరోసా కింద ఐ టి డి ఏ పరిధిలో రైతు భరోసా కింద ఈ ప్రాంత రైతులకు రూ. 30 కోట్లు, జగనన్న విద్యా దీవెన 1440 మంది ఎస్టీ విద్యార్థు లకు రూ.61.55 లక్షలు ప్ర యోజనం చేకూర్చమని తెలి పారు. రూ. 1577.17 లక్షల తో 61 స్కూల్స్ ను మనబడి నాడు నేడు తో అభివృద్ధి చేసాము. జగనన్న వసతి దీవెన కింద 1161 మంది విద్యార్థులకు రూ. 114 లక్షలు అందించాము. రూ.3505.07 లక్షలతో 33 బిటి రోడ్స్ పనులు చేపట్టాము. రూ. 2850 లక్షలు అంచనా తో 68 సచివాలయాలు, 68 అర్భికేల రూ.1482.05 లక్షలతో, రూ.787.50 లక్షలతో 45 వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. ముందుగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ కార్తికే య మిశ్రా ఆవిష్కరించగా , అనంతరం ఆదివాసి జెండాను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆవిష్కరిం చారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలలో కలెక్టర్ మరియు ఎమ్మెల్యే పాల్గొని వారితోపాటు లయబద్ధంగా నృత్యం చేశారు. ఐటిడిఎ ఆవరణలో జగనన్న పచ్చ తోరణం సందర్భంగా మొ క్కలు నాటారు. నాడు నేడు భాగంలో లో కోట రామచంద్ర పురం గిరి జన సంక్షేమ పాఠ శాల లో 51.68 లక్షల రూపా యల వ్య యంతో నిర్మించిన ప్రహరీ గోడ ను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రారంభిం చారు. ఆదివాసి హక్కుల కోసం పోరాడిన నా యకుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే తెల్లం బాల రాజు మాట్లాడుతూ ఆదివా సీల అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం వైయస్ జగ న్మోహన్ రెడ్డి కృషేనని అలాగే పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత దివంగత వై స్సార్ ది అని కొనియాడారు. వైస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి పోలవరం నియోజక వర్గంలో పోడు భూములకు 2500 మందికి పట్టాలు మం జూరు చేశారన్నారు. పోలవరం నియోజకవర్గం లో ఉన్న గిరి జన గ్రామాలలో రోడ్లు , త్రాగు నీరు. , విద్య వైద్య విద్యుత్ సౌకర్యం అందుతుంది అంటే అది దివంగత నేత రాజశేఖ రరెడ్డి మరియు ఆయన తన యుడు జగన్ మోహన్ రెడ్డి వలన సాధ్యమైంది అని ఎమ్మెల్యే అన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందు తున్నాయి అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వం లోనే అని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు అని గిరిజన సమస్యలు గాలికి వదిలేసారన్నారు. అలాగే ఏజెన్సీ అభివృద్ధి లోభాగం గా గిరిజనులకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవ డం జరిగింది అన్నా రు. అలా గే గిరిజన సంక్షేమ కోసం అనేక పథకాలు చేపట్టడం జరిగింది అని , వారి కోసం ఐటీడీఏ నిధుల నుండి గతం లో వివిధ చేతి వృత్తుల పనిముట్లు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ పిఓ ఆనంద్, జంగారెడ్డి గూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మి , పోలవరం డిఎస్పి కే.లతా కుమారి,ఏ.యం.సి.ఛైర్మెన్, కరాటం సీతా దేవి, ఉనికే బొ ద్ది, నియోజక గిరిజనులు భారీగా పాల్గొ న్నారు.

PressRelease