Close

పత్రికా ప్రకటన. నరసాపురం.అక్టోబరు.19, 2022. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి .ప్రశాంతి అన్నారు .

Publish Date : 19/10/2022

పత్రికా ప్రకటన.

నరసాపురం.అక్టోబరు.19, 2022.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పర్యటన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి .ప్రశాంతి అన్నారు .

బుధవారం నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ భవనాన్ని , బీచ్ ప్రాంతాన్ని ,చినమామిడి పల్లి లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించి అధికార్లకు పలు సూచనలను జిల్లా కలెక్టరు జారీచేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ అక్టోబరు 27 న నరసాపురం మండలం పెదమైనవానిలంక దత్తత గ్రామాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పర్యటన కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఏటువంటి లోటుపాట్లు రాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. దాదాపు రెండున్నర గంటలు పాటు ఆర్థిక శాఖ మంత్రి కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యంగా కోస్టల్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం , డిజిటల్ భవనం పరిశీలన,తీర ప్రాంత మత్స్యకారుల కుటుంబాలు వారి జీవన శైలి , డ్వాక్రా గ్రూపుల మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయన్నారు. పర్యటన నిమిత్తం శాఖలు వారీగా ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసి సిద్ధంగా ఉండడంతో పాటు, కార్యక్రమం ఏర్పాట్లు సమిష్టిగా పనిచేసి విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు.

జిల్లా కలెక్టరు వెంట సబ్ కలెక్టరు యం. సూర్య తేజ,ఆర్ & బి శాఖ ఈ ఈ యస్. లోలేశ్వర రావు, తహశీల్దారు యస్ యం ఫాజిల్ ,యం పి డి వో యన్ వి యస్ ప్రసాద్ యాదవ్, ఏ పి యం పిప్పళ్ళ.పద్మ, ఏ ఈ లు వై వి ఆర్ నాగేశ్వర రావు,టి.నిక్కి క్రజ్ , తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..

జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.