Close

పత్రికా ప్రకటన. తాడేపల్లి గుడెం.19-10-2022. సచివాలయాల సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని, ఎటువంటి పిర్యాదులు వచ్చినా బాధ్యత వహించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె .వి. మురళి అన్నారు.

Publish Date : 19/10/2022

పత్రికా ప్రకటన.

తాడేపల్లి గుడెం.19-10-2022.

సచివాలయాల సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని, ఎటువంటి పిర్యాదులు వచ్చినా బాధ్యత వహించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె .వి. మురళి అన్నారు.

బుధవారం తాడేపల్లి గుడెం పట్టణం లోని 21,22,23 సచివాలయాలను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సేవలను నిరుపేదల ఇంటివద్దకు తీసుకువెళ్లేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల జాబితాలను పధకాల వారీగా నోటీసు బోర్డులో ఉంచాలని, అదేవిధంగా అనర్హుల జాబితాలను కూడా నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రతీ రోజు సచివాలయం పరిధిలో స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించాలని, వాటిని అదేరోజు సంబంధిత శాఖల అధికారులను పరిష్కారం నిమిత్తం పంపించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందించాలన్నారు. సచివాలయం ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు సమన్మయంతో పని చేస్తే ప్రజలు మన్ననలు పొంది మంచి పేరు తీసుకురావాలని అయన అన్నారు. శాఖల వారీగా సచివాలయం ఉద్యోగులను వర్క్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. స్పందన, సి సి ఆర్ సి కార్డ్స్ , ఈ క్రాఫ్, ఈ -కే వై సి, రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే స్థాయిలో ఉండాలని, ఏ చిన్న పిర్యాదు లేకుండా చక్కగా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. సచివాలయం బయట డిస్ ప్లే చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల జాబితాలని పరిశీలించి, అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి పలు సూచనలు జారీ చేశారు.

జిల్లా జాయింటు వెంట తాడేపల్లి గుడెం పురపాలక సంఘం కమీషనరు బి. బాలస్వామి , సచివాలయం సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – – – –

జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ.భీమవరం వారిచే జారీ.