Close

పత్రికా ప్రకటన. తణుకు.అక్టోబరు.19,2022. నరసాపురం సబ్ కలెక్టరు యం. సూర్య తేజ మోటార్ సైకిల్ స్వయంగా డ్రైవ్ ఉదయాన్నే శానిటేషన్ పై పలు ప్రాంతాలు తిరిగి అకస్మిక తనిఖీలు చేసి పలు లోపాలు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు.

Publish Date : 19/10/2022

పత్రికా ప్రకటన.

తణుకు.అక్టోబరు.19,2022.

నరసాపురం సబ్ కలెక్టరు యం. సూర్య తేజ మోటార్ సైకిల్ స్వయంగా డ్రైవ్ ఉదయాన్నే శానిటేషన్ పై పలు ప్రాంతాలు తిరిగి అకస్మిక తనిఖీలు చేసి పలు లోపాలు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు.

బుధవారం తణుకు పురపాలక సంఘం పరిధిలో రాష్ట్ర పతి రోడ్, మార్కెట్ వీధి, పళ్ళ మార్కెట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్,వీరభద్ర నగర్, పైడి పర్రు తది తర ప్రాంతాలు ఉదయాన్నే స్వయంగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ తాను సబ్ కలెక్టర్ అని తెలియపరచకుండా స్వయంగా పరిశీలించి శానిటేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణంలో కొందరు ఎక్కడ పడితే అక్కడ చెత్త ను వేయుట గమనించారు.ఎటువంటి అపరాధ రుసుం వేయుట లేదని ఆయన గమనించారు. చెత్త వాహనాలలో పొడి, తడి చెత్త వేరుచేయుటలేదని , శాని టేషన్ సిబ్బంది చేతులకు గ్లౌజ్ వేసుకోవటం గాని తది తర జాగ్రత్తలు తీసుకోవడం లేదని పరిశీలించారు.డ్రైనేజీ కూడా పూడిక తీయ్యుటలేదని దాని వలన పరిసరాలు పరిశుభ్రత లేదని చూసారు.ప్రజలను స్థానికంగా ఉన్న సమస్య సబ్ కలెక్టరు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ ఉదయాన్నే స్వయంగా మోటార్ సైకిల్ మీద కొన్ని ప్రాంతాలు అకస్మిక తనిఖీలు చేయుట జరిగిందన్నారు.చాలా లోపాలు గుర్తించామని వీటి శాశ్వత పరిష్కారం కొరకు ఒకటి రెండు రోజుల్లో స్థానిక పురపాలక సంఘంలో అధికారులు నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకూ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, సాధ్యమైనంత తొందరలో తణుకు పుపాలక సంఘం శానిటేషన్ , తది తర లోపాలు సరి చేస్తానని సబ్ కలెక్టరు యం సూర్య తేజ అన్నారు.

జిల్లా సమాచార శాఖ.భీమవరం వారిచే జారీ.