పత్రికా ప్రకటన , ఏలూరు ,తేది.5.8.2021. జిల్లా లో ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని బ్రతికించాలని జిల్లా కలెక్టర్ శ్రీకార్తికేయ మిశ్రా అన్నారు గురువారం వనమహుత్సవం 2021 జగనన్న పచ్చతోరరణం కార్యక్రమంలో దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో హైస్కూలు ఆవరణలో మొక్కలు నాటారు

పత్రికా ప్రకటన ,
ఏలూరు ,తేది.5.8.20 21. జిల్లా లో ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని బ్రతికించాలని జిల్లా కలెక్టర్ శ్రీకార్తికేయ మిశ్రా అన్నారు గురువారం వనమహుత్సవం 2021 జగనన్న పచ్చతోరరణం కార్యక్రమంలో దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో హైస్కూలు ఆవరణలో మొక్కలు నాటారు .అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవుల శాతం తగ్గడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ప్రజలు, వన్యప్రాణులు ఎన్నో ఇబ్బదులకు గురువుతారన్నారు. అడవులు శాతం తక్కువగా ఉండటం వల్ల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని ఆయన అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. నవంబర్ లో వచ్చే కార్తీక మాసం నాటి జిల్లాలో 80 లక్షల మొక్కలు నాటి వాటిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు . నూతనంగా నిర్మించే గృహాల వద్ద కనీసం రెండు మొక్కలు నాటేందుకు స్థలం కేటాయించాలని ఆయన సూచించారు. ఇళ్లు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చేటప్పుడు మొక్కలు నాటేందుకు స్థలం ఉన్నదోలేదో పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆయన అన్నారు. మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకొని జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థిని, విద్యార్థులు అందరకూ మొక్కలు పంపిణీ చేయాలని వారి ఇంటి దగ్గర నాటి వాటిని బతికించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం అటవీ శాఖ తరపున జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక ఉద్యమంగా
సాగించి ప్రజల ఆలోచనలలో మార్పు తీసుకొని రావడం ద్వారా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం తో పాటు వాటిని రక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు.
దెందులూరు శాసనసభ్యులు శ్రీ కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ జిల్లాలో నర్సరీలలో 21.40 లక్షల మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని , జిల్లా అంతటా ఈ మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన అన్నారు. మన జిల్లాలో 33 శాతం అడవులు ఉండాలని కానీ 15 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని , అది భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ప్రోత్సహించాలని ఆయన సూచించారు . రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న గృహ నిర్మాణ కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటి వద్ద ఒక మొక్క నాటే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ప్రతి గ్రామం కు తీసుకువెళ్లి పెద్ద ఎత్తున మొక్కలు నటించేందుకు ప్రయత్నిస్తామన్నారు. దెందులూరు నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుంటామని అన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు ( వాసు బాబు ) మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన జగనన్న పచ్చతోరరణం కార్యక్రమం ద్వారా పర్యావరణంపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి సూచించారు. పర్యావరణం దెబ్బ తిన్నట్లయితే భవిష్యత్తులో మంచినీళ్లు కూడా దొరకడానికి ఇబ్బంది అవుతుందని , వర్షాలు పడక జలాలు భూముల్లో కి వెళ్ళాక భూగర్భజలాలు అడుగంటి పోతాయని అన్నారు. పట్టణాలు అభివృద్ధి చెంది కాంక్రీట్ జంగిల్ గా ఉన్నాయని ఆయన అన్నారు. వర్షాకాలంలో కూడా వాతావరణ సమతుల్యత దెబ్బతిని మండువేసవిలో ఉన్నట్లుగా ఉందని పచ్చదనం లేని కారణంగా వర్షాలు పడడం లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు జగనన్న పచ్చతిరణం కాయక్రమ0 ఒక యజ్ఞంలా పాల్గొని మొక్కలు విరివిగా నాటి మన పశ్చిమ గోదావరి జిల్లాను పచ్చని గోదావరి జిల్లా గా తయారుచేయడానికి ప్రతివక్కరు రెండు మొక్కలు చొప్పున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు .