Close

పత్రికా ప్రకటన , ఏలూరు, తేదీ.05.10.2021. త్వరిత గతిన ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Publish Date : 05/10/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు, తేదీ.5. 10.2021.

త్వరిత గతిన ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

మంగళవారం దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామం లో నిర్మిస్తున్న జగనన్న కాలనీ ఇళ్ళ నిర్మాణం పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇళ్లు నిర్మాణం ప్రగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలు వేగవంతంగా నిర్మించుకునేందుకు అన్ని వసతులు సమకూర్చులని అన్నారు. ఇళ్ళు నిర్మిస్తున్న వారికి ఎప్పటికప్పుడు స్టేజ్ వారీగా డబ్బులు పేమెంట్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కొలనిలో 147 మంజూరు చేయగా 44 మందికి బేస్ మెంట్ లెవెల్ పేమెంట్ పడ్డాయని మిగిలిన వారికి కూడా త్యరగా పేమెంట్ అయ్యేలా చూడాలన్నారు .
ఈ పర్యటనలో ఏలూరు ఆర్డీవో శ్రీమతి పనబాక రచన , దెందులూరు తాసిల్దార్ నాంచారయ్య , ఎంపీడీవో లక్ష్మి , హౌసింగ్ డి ఈ సోమేశ్వర రావు ,
ఏ ఈ వెంకటేశ్వరరావు , ఎంపీటీసీ జి.వరలక్ష్మి , సర్పంచ్ ఇంటెటి మధులత , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – – – – – – –
సమాచార శాఖ ఏలూరు నుండి జారీ.