Close

పత్రికా ప్రకటన, ఏలూరు, తేది. 03.10.2021. స్వయం సహాయక సంఘాల సభ్యులు వారు పొదుపుచేసుకున్న డబ్బులు , బ్యాంకు రుణాలు ద్వారా వచ్చిన డబ్బులు , ఇతర పథకాలు ద్వారా వచ్చిన డబ్బులు జీవనోపాదుల పెంపొందించే కార్యక్రమాలకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు.

Publish Date : 03/10/2021

పత్రికా ప్రకటన,

ఏలూరు, తేది.3. 10.2021.

స్వయం సహాయక సంఘాల సభ్యులు వారు పొదుపుచేసుకున్న డబ్బులు , బ్యాంకు రుణాలు ద్వారా వచ్చిన డబ్బులు , ఇతర పథకాలు ద్వారా వచ్చిన డబ్బులు జీవనోపాదుల పెంపొందించే కార్యక్రమాలకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు. ఆదివారం భీమడో లు మండలం భీమడోలు 1 గ్రామ సంఘా0 సమావేశం స్థానిక రామాలయం లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా విచ్చేశారు . గ్రామ సంఘ సమావేశం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమడోలు 1 గ్రామ సంఘం లో 52 సంఘాలు ఉన్నాయని అందులో 529 మంది సభ్యులు ఉండగా ఇందులో 13 స్వయం సహాయక సంఘాలకు 2021 -22 సంవత్సరంలో ఒక కోటి 25 లక్షల రూపాయలు బ్యాంకు రుణం కింద పొందడం జరిగిందని ఆయన తెలిపారు . వైఎస్ఆర్ ఆసరా కింద మొదటి విడతలో 45 సంఘాల్లోని 488 మంది సభ్యులకు 84లక్షల 10 వేల రూపాయలు , రెండో విడతలో 46 సంఘాలకు 465 మంది సభ్యులకు 86 లక్షల 10 వేల రూపాయలు వచ్చాయని , ఈ డబ్బులు అన్నిటిని జీవనోపాదులు పెంపొందించేందుకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు .
భీమడోలు 1 గ్రామ సమాఖ్య లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు చేస్తున్న వివిధ వ్యాపారాలు పెట్టుబడుల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ సంఘాల లోని సభ్యులు వారికి ఎంత మేర బ్యాంకుల నుండి రుణాలు వచ్చాయో , ఆసరా ద్వారా ఎంత డబ్బు వచ్చింది , చేయూత ద్వారా ఎంత డబ్బు వచ్చింది, కాపు నేస్తం ద్వారా ఎంత డబ్బు వచ్చింది తెలియజేసి వారు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు గేదెలు కొనుగోలు , బట్టల వ్యాపారం ,టి స్టాల్ నిర్వహణ వ్యాపారం ,ఇటుకల వ్యాపారం , వ్యవసాయం తదితర వ్యాపారాలు చేసుకుంటున్నట్లు వివరించారు.

భీమడోలు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న ఇళ్ల కాలనీకి
సి సి రోడ్డు ఎన్ఆర్ఈజీఎస్ లో మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కోలనికి అవసరమైన విద్యుత్ కొరకు కరెంటు స్తంభాలు వేసి త్వరితగతిన విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని ఆయన ఆదేశించారు . జలజీవ న్ మిషన్ లో ఇంటింటికి కుళ్ళయి ద్వారా మంచి నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు .
సంఘాలు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయవలసిందిగా కలెక్టర్ వారిని కోరగా కొంత మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా మాకు ఇల్లు స్థలాలు రాలేదని తెలియజేయగా , ఇల్లు నిర్మించు కోవడం జరుగుతుందని బిల్లు రావడంలేదని కొంతమంది తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని , ఇల్లు నిర్మించుకునే వారికి బిల్లులు త్వరలోనే వస్తాయని ఆయన తెలిపారు .అభయ హస్తం 15 సంవత్సరాల నుండి డబ్బులు కడుతున్నామని ఈ సంవత్సరం నుండి డబ్బులు రావడం లేదని వారు తెలియజేయగా వెంటనే దీనిపై సీఈఓ సెర్ఫ్ కు లేఖ రాయాలని పిడి ,డి ఆర్ డి ఏ ను ఆదేశించారు. ఉపాధి హామీ పనిలో కూలీ డబ్బులు పడలేదని కొంతమంది తెలియజేయగా మాస్టర్ జనరేట్ చేశారో లేదో పరిశీలించాలని ఆయన సూచించారు .

భీమడోలు మండలం భీమడోలు1 గ్రామ సంఘం సమావేశంలో డిఆర్ డి ఏ, పిడి శ్రీనివాసులు ,ఏలూరు ఆర్డీవో శ్రీమతి పనబాక రచన ,
డి ఆర్ డి ఎ ఏరియా కోఆర్డినేటర్ భూషణం , ఏ పీ ఎం అరవింద , స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – – – – – – – – సమాచార శాఖ ఏలూరు నుండి జారీ.