Close

పత్రికా ప్రకటన , ఏలూరు, తేదీ.13.9.2021. స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Publish Date : 13/09/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు, తేదీ.13. 9.20 21.

స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తు నిర్ణీత గడువులోగా పూర్తి పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు చెప్పిన విషయాలను సావధానంగా విని సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
తదనంతరం గోదావరి సమావేశ ప్రాంగణంలో షెడ్ లో వేచి ఉన్న అర్జీ దారుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను అక్కడికక్కడే తీసుకుని సంబంధించిన అధికారులు లకు పరిష్కారం కు ఆదేశించారు. అర్జీదారుల విన్నపాలను పూర్తిగా విని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉంగుటూరు మండలం గుళ్ల పాడు గ్రామం కు చెందిన మన్యం సుబ్బారావు ,వికలాంగులు ఇతనికి బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ ఇప్పించవలసినదిగా దరఖాస్తు చేసుకున్నారు .అధికారులను పిలిచి మోటర్ సైకిల్ మంజూరు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన కొనాల కుమారి వికలాంగురాలు ఈ నెల కరెంటు బిల్లు ఎక్కువ మొత్తంలో వచ్చిందని ఆమెకు వికలాంగుల ఫంక్షన్ నిలుపుదల చేయడం జరిగిందని , వికలాంగుల పెన్షన్ మంజరి కోరినారు . తాళ్ళపూడి మండలం అన్నదేవరపేట గ్రామం చెందిన బట్టు వెంకటేశ్ రావు వికలాంగులు పెన్షన్ మంజూరికి దరఖాస్తు చేసుకున్నారు . వికలాంగుల పెన్షన్ తో పాటు ఆరోగ్యం బాగా లేనందున మందులు కూడా ఇప్పించవలసిందిగా దరఖాస్తు చేసిఉన్నారు. దేవరపల్లి మండలం నుండి ch. సత్యవతి వృద్ధాప్యపు పెన్షన్ రావడం లేదని కలెక్టర్ గారికి విన్నవించగా తక్షణమే అధికారులను పిలిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామం కు చెందిన ఎలిచెర్ల విరరాఘవులు ,గాదె దమయంతి లకు సర్వే నెంబర్ 342లో పట్టానెంబర్ 386 లో లేండ్ సిలింగ్ లో ఒకొక్కరికి 0.25 సెంట్లు భూమి ప్రభుత్వం ఇచింది అని అప్పటి నుండి సాగుచేసుకుంటు జీవనం సాగించడం జరుగుతుంది , దానికి పట్టాదారు పాస్ బుక్ ఇప్పించవలసినదిగా దరఖాస్తు చేసి ఉన్నారు.

ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో లో వివిధ సమస్యలకు సంబంధించి 376 ఆర్జీలు అందగా వాటిలో వివిధ శాఖలకు చెందిన అవి ప్రధానంగా రెవెన్యూ 132 ,సెర్ఫ్ పెన్షన్లు 53 పోలీస్ 31 , పంచాయతీ రాజ్ శాఖ 29 , మున్సిపాలిటీ. 24 , సివిల్ సప్లై 11, వికలాంగుల సంక్షేమ శాఖ 10 తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు రావడం జరిగింది.
ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ )డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా , డి ఆర్ ఓ , వి డేవిడ్ రాజు , వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – — – – – – – – – –
సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు వారిచే జారీ.