Close

పత్రికా ప్రకటన, ఏలూరు, తేదీ.06.09.2021. ఈరోజు ఉదయం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరం లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీ. కార్తికేయ మిశ్రా గారు..

Publish Date : 06/09/2021

పత్రికా ప్రకటన,
ఏలూరు, తేదీ.06.09.2021.

ఈరోజు ఉదయం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరం లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీ. కార్తికేయ మిశ్రా గారు..

ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన పరిష్కారించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. వివిధ శాఖల అధికారులతో మాటాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్..
స్పందన గ్రీవెన్స్ కార్యక్రమము లో ఈరోజు 372 దరఖాస్తు వచ్చాయి, అందులో రెవెన్యూ 107 , పెన్షన్లు 53 ,పోలీసుశాఖ 38 ,పంచాయతీ రాజ్ శాఖ 29 , మున్సిపాలిటీలు 20 , సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల 18 , కలెక్టర్ కార్యాలయం 16 , డి ఈ ఓ 10, సివిల్ సప్లయ్ శాఖ 9 దరఖాస్తు లు తదితర సమస్యలపై దరఖాస్తు వచ్చాయి. మిగిలిన శాఖలకు సంబంధించి రెండు ,మూడు చొప్పున వచ్చాయి.

ఉండి మండలం పడమటి సత్యనారాయణ 13.5.2021 న మీసేవ కేంద్రంలో ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న ఇంతవరకు రాలేదని ఇసుక ఒప్పించాలని ఆయన కోరారు.

మార్ టేరుగ్రామం పెనుమంట్ర మండలం లోని నల్లమిల్లి వీర వెంకట సత్యనారాయణ అనే అతను అతని యొక్క కుమారుడు నల్లమిల్లి సత్య శ్రీనివాస్ రెడ్డి కి వివాహ అయినందున రైస్ కార్డు లో అతని పేరును తొలగించవలసిందిగా దరఖాస్తు చేయగా ఇంతవరకు అవ్వలేదని తనకుమారుని పెరు తొలగించా లని దరఖాస్తు సమర్పించారు.

భీమవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన లలిత కుమారి తేదీ .3.10.20 21న తన భర్త కరోనా తో మరణించాడని ఆమెకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని భీమవరం 11వ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయడం జరిగిందని , ఇంతవరకు తనకు పెన్షన్ మంజూరు కాలేదని ఎం. లాలితకుమారి దరఖాస్తులు సమర్పించారు .
కొవ్వలి మండలం ఐ పంగిడి గ్రామం చెందిన రుద్ర బోయిన నారాయణ , రుద్ర బోయిన శ్రీనివాస్ తండ్రి కొడుకులకు సంబంధించిన పూర్వికులు భూమి పంచగా సరిహద్దు దారులు తమ ఇద్దరిని కుట్రపూరితంగా హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారని ,మాకు రక్షణ కల్పించి మా యొక్క భూమి 2. 56 సెంట్లు భూమి హద్దులు నిర్ధారణ ఆర్ డి ఓ గారి సమక్షంలో విచారణ చేపట్టవలసిందిగా కోరి ఉన్నారు.

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివారు చల్ల వారి గూడెం గ్రామం కాలూరి వెంకన్నగారు కుమారుడు కాలూరు వీర్రాజు గారు సర్వ్ నెంబర్ 75 లో ఉన్న 5.00 సెంట్లు ప్రభుత్వ భూమి 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఆ భూమిలో గత సంవత్సరం జీడి మామిడి మొక్కలు నాటడం జరిగిందని , అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తనను కోట్టి టాక్టర్ తో తనపై దౌర్జన్యం చేసి మొక్కలను ధ్వంసం చేసి ఆ స్థలంలో పొగాకు వేయడం జరిగిందని ,దాని ని మేము తీసివేయగా మమ్మల్ని కొట్టడం జరిగిందని దానిపై జాంగారెడ్డి గూడెం లో పోలీస్ కేసు నమోదు చేయగా వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చట్టప్రకారం 20 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నా భూమి మాకు ఇప్పించవలసింది గా కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.

భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామానికి చెందిన రామిశెట్టి. వీర వేణి రేషన్ కార్డు కోసం రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేయడం జరిగిందని కాని ఇంతవరకు రేషన్ కార్డు మంజూరు కాలేదు రేషన్ కార్డ్ మంజరి చేయాలని దరఖాస్తు చేసినారు.

స్పందన గ్రీవెన్స్ దరఖాస్తులు స్వీకరణ లో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.బి ఆర్ అంబెడ్కర్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా , జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్ ) సూరజ్ ధనుంజయ్ , జాయింట్ కలెక్టర్ (ఆసరా) పద్మ వతి , డి ఆర్ ఓ, వి. డేవిడ్ రాజు , వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————
సమాచార పౌర సంబంధాలశాఖ , ఏలూరు నుండి జారి.