Close

పత్రికా ప్రకటన , ఏలూరు ,తేది.27.8.20 21 . జిల్లాలో ని మున్సిపల్ ఏరియాలు సమీప ప్రాంతాల లోని 227 సచివాలయాలలో ఈరోజు సాయంత్రం నాటికి 95 శాతం పైబడి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా మున్సిపల్ కమిషనర్లను , మండల అభివృద్ధి అధికారులు ఆదేశించారు .

Publish Date : 27/08/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు ,తేది.27.8.20 21 .

జిల్లాలో ని మున్సిపల్ ఏరియాలు సమీప ప్రాంతాల లోని 227 సచివాలయాలలో ఈరోజు సాయంత్రం నాటికి 95 శాతం పైబడి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా మున్సిపల్ కమిషనర్లను , మండల అభివృద్ధి అధికారులు ఆదేశించారు .

శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్ లు , మండల అభివృద్ధి అధికారుల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఈరోజు నిర్ణయించిన లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారి వివరాలు డేటా ఎంట్రీ సచివాలయ సిబ్బంది ద్వారా గాని , మున్సిపల్ సిబ్బంది ద్వారా గాని ఈరోజు సాయంత్రం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

జిల్లాలో శుక్ర ,శనివారాలలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తయిన జిల్లాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

18 సంవత్సరాలు పై బడిన వారందరికీ వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా 18 సంవత్సరాల పైబడిన వయస్సు కల్గిన జనాభా వివరాలను సేకరించి జాబితా ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని వ్యాక్సినేషన్ పూర్తి కాని వారికి సమాచారం అందించి వాక్సినేషన్ ఇప్పించాలని ఇందుకు వాలంటీర్లు సహకారం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. రెండు లక్షలమందికి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. దీనిపై జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు , మున్సిపల్ కమిషనర్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నిర్ణయించిన లక్ష్యం మేరకు కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయని వాటిని వ్యాక్సినేషన్ సెంటర్లకు పంపించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి )శ్రీ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) శ్రీమతి పద్మావతి డిఆర్ఓ డేవిడ్ రాజు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

సమాచార శాఖ ఏలూరు వారిచే జారీ చేయడమైనది.