Close

ఏలూరు, తేదీ.8.8.2021. జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసికోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా వ్యవసాయ అధికారులు లను ఆదేశించారు.

Publish Date : 08/08/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు, తేదీ.8.8.2021.

జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసికోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా వ్యవసాయ అధికారులు లను ఆదేశించారు.

ఆదివారం దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జరుగుతున్న ఈ క్రాఫ్ట్ బుకింగ్ ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విలేజ్ అసిస్టెంట్ నుండి ఈ క్రాఫ్ బుకింగ్ ఏవిధంగా చేయాలో తెలుసుకుని వ్యవసాయ పొలంలో ఒక రైతు వివరాలను కలెక్టర్ నమోదు చేసి రైతు ఫోటో కూడా ట్యాబ్ లో తీశారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 6,03,191 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇప్పటివరకు 3,59,772 ఎకరాలు పంటలు వేశారని అందులో ఇప్పటి వరకూ 1,28,824 ఎకరాల ఈ క్రాఫ్ నమోదయిందని ఆయన తెలిపారు. ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు . రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన ఎరువులు , పురుగుమందులు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. మార్క్ ఫెడ్ లో ఎరువుల స్టాకును పెంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ క్రాఫ్ నమోదు చేసుకోవడం వల్ల డాక్టర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని , సున్నా వడ్డీ పథకం రుణాలు మంజూరు చేయడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ అమలుకు అవకాశం కలుగుతుందని , వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. సి సి ఆర్ సి కార్డులు మంజూరు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగ్గారావు , ఏ డి సుబ్బారావు ,దెందులూరు ఎమ్మార్వో నాంచారయ్య , ఎం పి డి ఓ ఎబివిపి లక్ష్మి , వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి జనంపేట బాబు , వ్యవసాయ శాఖ అధికారులు , రైతులు తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు నుండి జారీ.

 

PressRelease