Close

పత్రికా ప్రకటన, ఏలూరు . తేదీ. 7.8.2021. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజి నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 07/08/2021

పత్రికా ప్రకటన,
ఏలూరు . తేదీ. 7.8.2021.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజి నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు లో 525 కోట్ల రూపాయలతో మంజూరు అయిన మెడికల్ కళాశాల భవనాలు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ల్యాండ్ లెవెలింగ్ ,విద్యుత్ లైన్లు మార్చడం , చెట్లు తొలగించడం వంటి కార్యక్రమాలు చేయాలని ఆయన ఆదేశించారు.
మెడికల్ కాలేజ్ 750 బెడ్ ల సామర్థ్యంతో 14,39,918 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంతో మెయిన్ హాస్పిటల్ ,మెడికల్ కాలేజ్ భవనం , నర్సింగ్ కాలేజ్ , హాస్టల్స్ , స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. మెడికల్ కళాశాల భవనాలు నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి ఇంకా చేపట్టవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి ) శ్రీ హిమాన్షు శుక్లా , ట్రైనీ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ,డి సి హెచ్ ఎస్ ,ఏ విఆర్ మోహన్ ,డియమ్ & హెచ్ ఓ బాను నాయక్ ,సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ , AP MSIDC అధికారులు ,ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – –
సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.