Close

పత్రికా ప్రకటన, ఏలూరు, తేదీ.31.1.2022. వృద్ధుల సమస్యపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్.

Publish Date : 31/01/2022

పత్రికా ప్రకటన,
ఏలూరు, తేదీ.31.1.2022.

వృద్ధుల సమస్యపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్.
సోమవారం కలెక్టర్ కార్యాలయంకు ఉంగుటూరు మండలం కైకారం గ్రామం వాసి గుర్రం లక్ష్మి వయస్సు 65 సంవత్స రాలు కలెక్టర్ కార్యాలయం నకు రావడం జరిగింది. కైకారం గ్రామంలోని 456/107 సర్వేనెంబర్ లో 80 చదరపు గజాలు స్థలం ఉందని ఆమె స్థలం కు దక్షిణ వైపు ఉన్న ఉమ్మడి సందును ఇటీవల రంది విజయ్ అనే వ్యక్తి ఇరువురి ఉమ్మడి సంది ని , తన స్థలంకు ఉత్తరం దిక్కున ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించారని , ఏమిటి ఈ అన్యాయం అని ప్రశ్నించగా. రంది విజయ్ అతని భార్య , వారి కుమారులు రంది భాస్కరరావు తనపై నానా దుర్భాషలాడుతూ ఈ స్థలం ఖాళీచేసి వెళ్లాలని లేకపోతే చంపేస్తామని బెదిరించి నట్లు జిల్లాకలెక్టర్ గారికి దరఖాస్తులు సమర్పించారు . వెంటనే కలెక్టర్ గారు ఆమె ఇచ్చిన ధరకాస్తూ పై స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజన సమయంలో భోజనానికి వెళుతున్న జిల్లా కలెక్టర్ కు ఒక వృద్ధురాలు ఎదురు వచ్చింది. తక్షణమే జిల్లా కలెక్టర్ వాహనం దిగి ఏమిటి నీ సమస్య అని ఆమెని అడిగారు. ఆమెది తాడేపల్లిగూడెం మండలం జగన్నాధ పురం గ్రామం అని నాపేరు వస్త్రాల సీతమ్మ వయస్సు 75 సంవత్సరాలు మహిళ నేను ఇళ్ళలో పాచిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారని , నాకు ముగ్గురు కుమారులు ఉన్నారని నన్ను ఎవరు పట్టించుకోరని అమె తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్నానని తన ఆరోగ్యం బాగోక ప్రతిరోజు మందులకు వాడుతున్నానని ఆమెకు నెలకు 4,500 రూపాయల వరకు మందులు ఖర్చు అవుతుందని అమె తెలిపారు. ఆమె సంపాదించుకున్న డబ్బులు ద్వారా, చిన్న చిన్న పనులు చేసుకుంటూ మందులు కొనుగోలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అమె తెలపారు. ఇటీవల ఆమె చిన్న కుమారుడు తన వద్ద నున్న మూడు లక్షల రూపాయలను తీసుకుని బయటకు గెంటేశారు అని అమె తెలిపారు . ఆమెకు ముగ్గురు కొడుకులు ఎవరు పట్టించుకోవడం లేదని నాకు న్యాయం చేయవలసిందిగా ఆమె కలెక్టర్ ని కోరారు. దానిపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించి రెవెన్యూ ,పోలీస్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమెకు మందులకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎంఅండ్ హెచ్ ఓ ను కలెక్టర్ ఆదేశించారు .
– – – – – – – – – – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారి.