Close

పత్రికా ప్రకటన, ఏలూరు ,తేది .22.1.20 22. విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంచి దేనినైనా ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఉపాధ్యాయులను ఆదేశించారు.

Publish Date : 22/01/2022

పత్రికా ప్రకటన,
ఏలూరు ,తేది .22.1.20 22.

విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంచి దేనినైనా ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఉపాధ్యాయులను ఆదేశించారు.

శనివారం సత్రంపాడు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల సెక్షన్ బి , సి క్లాసులో విద్యార్థులతో మాట్లాడుతూ మీ క్లాస్ టీచర్ పాఠాలు ఏ విధంగా చెబుతున్నారు మీకు అర్థం అవుతున్నాయా తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ స్టడీస్ లో జాగ్రఫీ గురించి ఏమేమి ఉన్నాయి, వాటి గురించి మీకు ఏమీ తెలుసు అని జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడిగారు . భారతదేశం మేప్ ని కలెక్టర్ స్వయంగా బోర్డు పై గీసి ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, కేరళ , మహారాష్ట్ర , ఒరిస్సా రాష్ట్రాలు, చైనా ,పాకిస్తాన్ , థాయిలాండ్ ఇతర దేశాల గుర్తించాలని విద్యార్థులకు సూచించారు. అందులో కొంతమంది విద్యార్థులు రాష్ట్రాల పేర్లు సక్రమంగా గుర్తించని కారణం గా కళాశాల హెడ్మాస్టర్ , ఉపాద్యాయులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెంచడానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పిల్లలకు పాఠాలు చెప్పడం ఒక్కటే కాదని వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరు ఇంప్రూవ్ కావాలని ఆయన అన్నారు. విద్యార్థులు బట్టీ పట్టడం కాదని విషయాన్ని తెలుసుకునే విధంగా చేయాలని ఆయన అన్నారు.ఫైనల్ పరీక్షల కు విద్యార్థులు అందరూ ఏ ప్లస్ టార్గెట్ గానే కష్టపడి చదవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్ కు వచ్చేటప్పుడు యూనిఫామ్ , షూ కచ్చితంగా వేసుకు రావాలని ఆయన ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో డి ఈ ఓ శ్రీమతి సివి రేణుక , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మురళీకృష్ణ , ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.