Close

పత్రికా ప్రకటన , ఏలూరు ,తేదీ.29.12.2021. పెద్దపాడు మండలం వట్లూరు లోని రైతుబరోసా కేంద్రం ,సత్యకృష్ణ రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ శ్రీ గిరిజా శంకర్ , జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.

Publish Date : 29/12/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు ,తేదీ.29.12.2021.

పెద్దపాడు మండలం వట్లూరు లోని రైతుబరోసా కేంద్రం ,సత్యకృష్ణ రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ శ్రీ గిరిజా శంకర్ , జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.

బుధవారం పెదపాడు మండలం వట్లూరు లోని రైతు భరోసాకేంద్రారం, సత్యకృష్ణ రైస్ మిల్లును ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వట్లూరులో ఉన్న ఆర్ బి కె లో ఉన్న ఎరువులను వారు పరిశీలించి , రిజిస్టర్ లను పరిశీలించారు . రిజిస్టర్ లో ఉన్న స్టాకు , అక్కడ ఉన్న స్టాకు సరిపోయిందా లేదా అని పరిశీలించారు. ఎంత మంది రైతులు ఈ క్రాఫ్ నమోదు చేసుకున్నారు , ఇప్పటివరకు ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారిలో ఎంతమంది ధాన్యం ఆర్ బి కె నుండి కొనుగోలు చేశారు, ఎంతమందికి డబ్బులు చెల్లించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం లో మొదటి కొనుగోలు ఎప్పుడు ప్రారంభించారు, డబ్బులు ఎన్ని రోజులలో చెల్లించారు తెలుసుకుని రైతులతో ఫోన్ లో నేరు గా మాట్లాడు. ఆర్బికే లో ఉద్యోగులు చెప్పిన విషయాలు రైతులు చెప్పిన విషయాలను సరి చేసుకున్నారు. గతంలో కంటే ఇప్పుడే రైతులకు సౌకర్యంగా ఉందని రైతులు తెలిపారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఎంత డబ్బు చెలించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు . వ్యవసాయ శాఖ ఏ ఓ ను ధాన్యం ఎంత దిగుబడి వచ్చింది ?ఎంత దాన్యాన్నీ అమ్మారు, ఎక్కడ అమ్ముతారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నేరుగా ఆర్ బి కే ద్వారా అమ్మడం జరుగుతోందని ఆక్కడ నుండి మిల్లులకు పంపించడం జరుగుతుందని ఏవో తెలియజేశాడు.
సత్య కృష్ణ రైస్ మిల్ కు వెళ్లి మిల్లులో దాన్యాన్ని ఏ విధంగా దిగుమతి చేసుకుంటున్నారు, దిగుమతి చేసిన ధాన్యాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు,
ధన్యాన్ని ఏ విధంగా బియ్యం ఆడుతున్నారు ,బియ్యం ఏవిధంగా వస్తున్నాయి గ్రేడింగ్ ఏ విధంగా అవుతుంది . తవుడు ,చిట్టు ఏ విధంగా వెళుతుంది, మిల్లు మొత్తం ఏ విధంగా పనిచేస్తుంది అనే వివరాలన్నింటినీ వారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్( రెవెన్యూ ) డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ , సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ డి రాజు , వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగ్గారావు , వ్యవసాయ శాఖ ఏ డి సుబ్బారావు, ఏవో ప్రవీణ్ కుమార్, ఆర్ బి కె సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు .
– – – — – – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాలు శాఖ ఏలూరు నుండి జారీ.