పత్రికా ప్రకటన, ఏలూరు తేది.29.10.2021 . జిల్లాలో కౌలు రైతులకు ccrc కార్డు దారులకు ఈ సంవత్సరం రూ. 880 కోట్ల రూపాయలు టార్గెట్ కాగా సెప్టెంబర్ 30 నాటికి 41385 మంది రైతులకు రూ.190.17 కోట్లు రుణాలు అందించడం జరిగిందని, ccrc కార్డుదారులకు రుణాలు ఎక్కువ మొత్తంలో అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా బ్యాంకు అధికారులకు సూచించారు.

పత్రికా ప్రకటన,
ఏలూరు తేది.29.10.2021 .
జిల్లాలో కౌలు రైతులకు ccrc కార్డు దారులకు ఈ సంవత్సరం రూ. 880 కోట్ల రూపాయలు టార్గెట్ కాగా సెప్టెంబర్ 30 నాటికి 41385 మంది రైతులకు రూ.190.17 కోట్లు రుణాలు అందించడం జరిగిందని, ccrc కార్డుదారులకు రుణాలు ఎక్కువ మొత్తంలో అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా బ్యాంకు అధికారులకు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో డి సి సి మరియు dlrc బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్డు దారులకు ఎక్కువ మంది రైతులకు రుణాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు . కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయని IDBI, kotak Mahindra, ICICI బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేయలేదని, ccrc రుణాలు ఇవ్వని బ్యాంకులు జిల్లాలో షట్ డౌన్ చేయాలని ఆర్బీఐ కి లేఖ రాయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వని బ్యాంకుల పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కౌలు రైతులకు వచ్చే పది రోజులలో ప్రతీ బ్యాంకు కు నిర్ణయించిన టార్గెట్ మేరకు రుణాలు మంజరి చేయాలని బ్యాంకు అధికారులకు ఆయన సూచించారు.
వ్యవసాయం రంగానికి ఈ సంవత్సరం 13640 కోట్లు వివిధ పథకాల కింద రుణాలు మంజూరు చేయవలసి ఉండగా సెప్టెంబర్ 30 వరకు వరకు 8222. 64 కోట్లు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగాలకు 19362 కోట్లు రూపాయలు లక్ష్యం కాగా సెప్టెంబర్ 30 వరకు రూ.11129.56 కోట్లు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. స్వల్పకాలిక రుణాల కింద రూ. 10800 కోట్లు ఈ సంవత్సరం లక్ష్యం కాగా రూ. 6529.08 కోట్లు అందించడం జరిగిందని ఆయన అన్నారు. ఖరీఫ్ లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు 6480 కోట్లు కు గాను 6529 కోట్ల రూపాయలు లక్ష్యాన్ని అధిగమించి మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా లో ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి 19362 కోట్లు లక్ష్యం కాగా 11129.56కోట్లు అందించడం జరిగిందని ఆయన అన్నారు.
20 21 – 22 వ సంవత్సరానికి జిల్లా రుణ లక్ష్యం 22456 కోట్లు కాగా ఆరు నెలల్లో రూ 13026 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళా సంఘాలకు ఈ సంవత్సరం 67,147 సంఘాలకు 671 .47 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా మొదటి ఆరు నెలలు లలో 26211 సంఘాలకు రూ. 651.18 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని , 4100పట్టణ మహిళా సంఘాలకు రూ. 123 కోట్లు లక్ష్యం కాగా 1978 సంఘాలకు రూ. 108. 13 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఆయనతెలిపారు.
ఆసరా పథకం కింద మంజూరైన రెండవ విడత నిధులు ఈ సోమవారం నాటికి వ్యక్తిగత ఎకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన ఆదేశించారు. కొన్ని బ్యాంకులలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు పాస్ పుస్తకాలు ప్రింట్ చేయట్లేదని బ్యాంకులలో పాసుబుక్కులు కొరత లేకుండా ఎప్పటికప్పుడు ప్రింటింగ్ చేయాలని ఆయన సూచించారు . స్వయం సహాయక సంఘాలకు జగనన్నతోడు కింద రుణాలు మంజూరు చేయడం జరిగిందని వాటిని లబ్ధిదారులకు అకౌంట్లోకి జమ చేయలేదని వెంటనే జమ చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో idco లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి స్వా నిధి పథకం కింద ఎంపిక చేయబడిన 6384 మంది వీధి వ్యాపారుల ఒక్కొక్కరికి పదివేల రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగిందని , స్వానిధి పథకానికి ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేయాలని ఆయన అన్నారు. విద్యారుణాలక్రింద 3300 మందికి రు. 107 కోట్లు లక్ష్యం కాగా 671 మందికి రూ.54.32 కోట్ల రూపాయల విద్యా రుణాల మంజరి చేయడం జరిగిందని అన్నారు .పియం ఇ జి పి క్రింద పరిశ్రమ లను ప్రోత్సహించేందుకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు.
RBI AGM శరత్ చంద్ర మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు డేటా సరి అయిన సమయంలోగా అందిచినందుకు బ్యాంకర్లు ను అభినందించారు. ఈ సమావేశం కు జిల్లా కో ఆర్డినేటర్ లు విధిగా హాజరు కావాలన్నారు. పెండింగ్ ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్ లను ట్యారితగతిన నియమించాలని ఆయన సూచించారు. బ్యాంకులలో రుణాల మంజూరు చేసినప్పుడు ఇన్సూరెన్స్ చేయమని ఎవరిని బలవంతం చేయొద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శ్రీ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జాయింట్ కలెక్టర్ (గృహనిర్మాణం) సూరజ్ గానోరే , డిసిసి కన్వీనర్, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఐ . సత్యనారాయణ మూర్తి , నాబర్డ్ డిడియం అనిల్ కాంత్ , ఎల్ డి ఎం ఎస్ ఎస్ ఏ. వెంకటేశ్వరరావు , జిల్లా అధికారులు , బ్యాంకు కోఆర్డినేటర్లు అధికారులు తదితరులు హాజరయ్యారు.
– – – – – – – – – – – – – – – –
సమాచార పౌర సంబంధాల శాఖ , ఏలూరు నుండి జారీ