Close

పత్రికా ప్రకటన , ఏలూరు, తేదీ. 11.10.2021.స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Publish Date : 11/10/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు, తేదీ. 11 . 10.20 21.

స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తు నిర్ణీత గడువులోగా పూర్తి పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు చెప్పిన విషయాలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ సంబంధిత దరఖాస్తు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో లో వివిధ సమస్యలకు సంబంధించి 347 ఆర్జీలు అందగా వాటిలో వివిధ శాఖలకు చెందిన అవి ప్రధానంగా రెవెన్యూ 92 , పెన్షన్ లు 53, పంచాయతీ రాజ్ శాఖ 36 పోలీస్ 38 , మున్సిపాలిటీ 27 , గృహనిర్మాణ శాఖ 10 తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు రావడం జరిగింది.
ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జయింట్ కలెక్టర్ ( అభివృద్ధి ) శ్రీ హిమాన్షు శుక్లా ,జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ )డా.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం) , సూరజ్ గానోరే , జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)
శ్రీమతి పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – — – – – – – – – –
సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు వారిచే జారీ.