పత్రికా ప్రకటన, ఏలూరు, తేదీ.7.10.2021. 2వ విడత ఆసరా పథకంలో రాష్ట్రంలో 79 లక్షల మంది మహిళలు డబ్బు పొందుతున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత తెలిపారు.

పత్రికా ప్రకటన,
ఏలూరు, తేదీ.7.10.2021.
2వ విడత ఆసరా పథకంలో రాష్ట్రంలో 79 లక్షల మంది మహిళలు డబ్బు పొందుతున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత తెలిపారు.
గురువారం దెందులూరు మండలం గంగన్న గూడెం లో జిల్లాస్థాయి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్నట్లు మహిళ మణులను లక్షాధికారులు చేయాల నే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు మహిళల పేరునే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. లక్షల విలువచేసే ఇంటి స్థలం కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. మహిళా సాధికారత సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభిమతమని మహిళలు సంతోషంగా ఉన్న రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆమె అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులు మీరు మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆమె సూచించారు . గత ప్రభుత్వం ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి బ్యాంకు అప్పు కట్టవద్దని చెప్పి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తరువాత స్వయం సహాయక సంఘాల సభ్యులను గాలికి వదిలేశారని బ్యాంకుల హలో బాకీ పెరిగిపోయి నోటీసులు పంపించారని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల సమయానికి ఎంత డబ్బు బ్యాంకు అప్పుగా ఉంటే అంతడబ్బు మీకు చెల్లించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఎన్నికల నాటికి మీ సంఘం బ్యాంక్ అప్పు సొమ్మును తిరిగి చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న , కోవిడ్ పరిస్థితులను అనుకూలించక పోయినా కూడా మహిళలు అందరకు ఆసరా రెండోవిడత అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలు జిల్లాలో
తేదీ.11.4.2012 నాటికి వారి సంఘాలలో నెల 2759.60 కోట్ల రూపాయలు అప్పు నేరుగా నాలుగు సంవత్సరాల కాలంలో స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత సంవత్సరం మొదటి విడతలో 716275 మందికి రూ. 689. 89 కోట్ల రూపాయలు ఇవ్వగా రెండో సంవత్సరం 718224 మందికి రూ. 693. 61 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో
54. 37 స్వయం సహాయక బృందాలకు 53.61 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి
నేరు గా జమచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు కు వివిధ పథకాల ద్వారా అందిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డాక్రా , ఎస్ హెచ్ జి ఉద్యమం పశ్చిమ గోదావరి జిల్లా నుండే ప్రారంభమైందని ఎస్ హే జి ఉద్యమం లో మన జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వారు అందించే డబ్బులు మీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు అండగా డి ఆర్ డి ఎ నుండి ఏరియా కోఆర్డినేటర్ లు, ఎపియం లు అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తారని ఆయన అన్నారు .
దెందులూరు శాసనసభ్యులు శ్రీ కొట్టారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మహా నాయకుడు మన ముఖ్యమంత్రి అని ఆయన కొనియాడారు. మేనిపేస్టోలో పెట్టిన అంశాలలో 95 శాతం అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలు అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉన్నారని ఆయన తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఆయన అన్నారు . రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రోజు డాక్టర్ వైయస్సార్ ఆసరా పథకం కింద దెందులూరు నియోజకవర్గంలో 5437 గ్రూపులకు రూ. 53 .21 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలంటే మీయొక్క మీ అందరి సహాయ సహకారాలు అవసరమని ఆయన కోరారు.
చింతలపూడి శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజా మాట్లాడుతూ మహిళలకు ఆసరా పథకం క్రింద సహాయం అందిస్తూ వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారని ఆయన అన్నారు.
మహిళలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని మరింత సాధికారత సాధించాలన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. సాధ్యమయ్యే రంగాల్లో యూనిట్లు ప్రారంభించి ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. మహిళలకు అండగా ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మరింత అభివృద్ధికి ఉపయోగించాలని అన్నారు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. నిత్యం ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలను వినియోగించాలని మహిళలకు సూచించారు. పారిశ్రామిక వేత్తలు గా మారాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆసరా చెక్కులను మహిళలకు లాంఛనంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి )శ్రీ హిమాన్షు శుక్ల , జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) శ్రీమతి పద్మావతి , ఏలూరు ఆర్డీఓశ్రీమతి పనబాక రచన , డిఆర్డిఎ పి డి, శ్రీనివాస్ ,ఎంపీపీలు , జెడ్ పి టి సి లు, ఎంపీటీసీలు , జిల్లా , మండల సమైక్య సభ్యులు , స్వయం సహాయక సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – –
సహా సమాచార శాఖ ఏలూరు నుండి జారి.