Close

పత్రికా ప్రకటన , ఏలూరు ,తేదీ. 5.10.2021. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

Publish Date : 05/10/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు ,తేదీ. 5.10.2021.

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 7 నుండి 12 వ తరగతి వరకు చదువుకున్న కిశోర బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయనున్న ప్రభుత్వం. నెలకు 10 నాప్కిన్స్ చొప్పున సంవత్సరానికి 120న నెఫ్ కిన్స్ ఉచితంగా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థుల యొక్క వ్యక్తిగత శుభ్రతవల్ల ఆరోగ్యవంతులు ఉండి చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది.

ఏలూరు నగరంలోని కస్తూరిబా నగర బాలికొన్నత పాఠశాల లో స్వేచ్ఛ కార్యక్రమాన్ని ఎల్ ఈ డి స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా , డిఈఓ శ్రీమతి రేణుక ఐసీడీస్ పిడి విజయకుమారి , బాలికలు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం బాలికలకు శానిటరీ నేప్ కిన్స్ ను కలెక్టర్ పంపిణీ చేశారు.