Close

పత్రికా ప్రకటన , ఏలూరు,తేదీ 04-2-2022. పాలకొల్లు లోని టిడ్కో గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ వి. ప్రసన్న వెంకటేష్

Publish Date : 04/02/2022

పత్రికా ప్రకటన ,
ఏలూరు,తేదీ .4.2.2022.

పాలకొల్లు లోని టిడ్కో గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్.

శుక్రవారం పాలకొల్లు లో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం అన్ని బ్లాకు లను కలెక్టర్ పరిశీలించారు. గృహాలు ఏ విధంగా ఉన్నాయి, గృహాలకు నీటి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ వాటర్ ఎలా వెళ్తుంది అని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లులో 6,144 గృహాలు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 1,856 గృహాలు నిర్మాణాలు పూర్తయ్యాయని వీటిని త్వరలో లబ్ధిదారులకు అప్పజెప్పడం జరుగుతుందని ఆయన తెలిపారు. మిగిలిన గృహాలు పూర్తి అవ్వడానికి చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయన్నారు. ఈ 1,856 ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను శుభ్రపరచడం, నీటి సరఫరా, డ్రైనేజ్ ,విద్యుత్ సరఫరా మరొకసారి పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి , మెప్మా పిడి ఇమాన్యుల్, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ ఎన్. ప్రసన్న కుమార్ , తాసిల్దార్ జి .మమ్మీ తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – — – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.