పత్రికా ప్రకటన, ఏలూరు,తేదీ. 30.10.2021. వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు ఎరువులు ముందుగానే ల్యాబ్ లో పరీక్షించి వాటి నాణ్యతను నిర్ధారించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కాళీ కృష్ణ శ్రీనివాస్ తెలిపారు .

పత్రికా ప్రకటన,
ఏలూరు,తేదీ. 30.10.2021.
వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు ఎరువులు ముందుగానే ల్యాబ్ లో పరీక్షించి వాటి నాణ్యతను నిర్ధారించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కాళీ కృష్ణ శ్రీనివాస్ తెలిపారు .
శనివారం 24వ డివిజన్ లో 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కు జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా, నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ తో కలిసి శంకుస్థాపన చేశారు . అనంతరం మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు ,ఎరువులు, ముందుగానే ల్యాబ్ లో పరీక్షించి వాటి నాణ్యతను నిర్ధారించి రైతులకు అందజేయాలని ఉద్దేశించి ప్రతి నియోజకవర్గంలో లాబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు .జిల్లాలో 14 నియోజక వర్గాలు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు , తాడేపల్లిగూడెంలో ఉన్న ల్యాబ్ జిల్లా స్థాయి లాబ్ గా గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఈ ల్యాబ్ లో వ్యవసాయ ఉపకరణాలు నాణ్యత ప్రమాణాలు పరిశీలన నిమిత్తం రూ. 197.70 కోట్లు ఖర్చు తో 147 అసెంబ్లీ నియోజకవర్గ లాబ్ లు , 11 జిల్లా స్థాయి లో అత్యాధునిక లాబ్ లు, 4 ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు, 27 ఆక్వా టెస్టింగ్ లాబ్ లు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని ఆయన తెలిపారు .
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ,ఏలూరు నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్, డిప్యూటీ మేయర్ లు గుడి దేశీ శ్రీనివాస్ , n.సుధీర్ బాబు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగ్గారావు , 24 వ డివిజన్ కార్పొరేటర్ కలవకోలు సాంబ ,ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు , మెడికల్ కౌన్సిల్ మెంబర్ డా. ప్రసాద్ , రెడ్ క్రాస్ సంస్థ మాజీ అధ్యక్షులు యం. జయప్రకాష్ , వైయస్సార్ సిపి నాయకులు బలరాం,రవి తదితరులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు నుండి జారీ.