Close

పత్రికా ప్రకటన , ఏలూరు,తేదీ. 11.10.2021. బాలికలను ప్రతిఒక్కరూ గౌరవిచాలని బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలను జిల్లా కలెక్టర్ కుర్చీలో కూర్చోపెట్టి గౌరవించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా.

Publish Date : 11/10/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు,తేదీ. 11. 10.2021.

బాలికలను ప్రతిఒక్కరూ గౌరవిచాలని బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అన్నారు.
సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలను జిల్లా కలెక్టర్ కుర్చీలో కూర్చోపెట్టి గౌరవించిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా .

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన బాలికల్లో ఏలూరు ఎన్ ఆర్ పేట కు చెందిన దేవ దుర్గా సంజన ను కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టి ఆమెను గౌరవించారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి గుర్తింపుగా ఆమె చేత డాక్టర్ ,ఆశ కార్యకర్తలు , ఏఎన్ఎంలు , అంగన్వాడీ వర్కర్ లకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలు అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆ బాలిక పేరు ఏమిటి ఏమి చదువుతున్నావు ఏ పాఠశాలల్లో చదువుతున్నారు ఎన్నో తరగతి చదువుతున్నావు తల్లిదండ్రుల పేర్లు అడిగి తెలుసుకున్నారు .ఆమె ఏలూరులోని ఎన్ ఆర్ పేట కు చెందిన దేవ దుర్గా సంజన స్థానిక రవీంద్ర భారతి పాఠశాలలో 6వ తరగతి చదువుతుందని ఈమె తల్లి దేవ లక్ష్మీ సరస్వతి , తండ్రి దేవ శ్రీనివాసులు ముఠా పనిచేస్తారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎం &హెచ్ ఓ డాక్టర్ బి. రవి , డిప్యూటీ డిఎం & హేచ్ఓ డాక్టర్ లీలా ప్రసాద్ డాక్టర్ ఏ. పూజ మెడికల్ ఆఫీసర్ పెదపాడు , అంగన్వాడి వర్కర్స్, ఏ ఆన్ యం లు , ఆశలు ,అంగన్ వాడిలోని బాలికలు, అంగన్వాడీ ఆయా తదితరులు పాల్గొన్నారు .
– – – – – – – – – – – – – – –
సమాచార శాఖ ఏలూరు నుండి జారీ.