Close

పత్రికా ప్రకటన ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన ఎంతో అవసరం ఆర్థిక అక్షరాస్యత దిశగా అడుగులు ఆర్థిక భద్రత, ఆర్థిక పురోగతికి డిజిటల్ లావాదేవీలు దోహద పడతాయి ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్

Publish Date : 16/02/2022

పత్రికా ప్రకటన

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన ఎంతో అవసరం

ఆర్థిక అక్షరాస్యత దిశగా అడుగులు

ఆర్థిక భద్రత, ఆర్థిక పురోగతికి డిజిటల్ లావాదేవీలు దోహద పడతాయి

ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్

ఏలూరు/ దెందులూరు ,ఫిబ్రవరి16: స్థిరమైన, భద్రమైన ,సముచితమైన ఆర్థిక సేవలు పొందేందుకు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పై ప్రతి ఒక్కరిలో అవగాహన ఎంతో అవసరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు.

గో డిజిటల్ గో సెక్యూర్ అనే నినాదంతో చేపట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం దెందులూరు మండలం కొవ్వలి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక చేకూర్పు అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో బ్యాంకింగ్ రంగం సేవలో ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సేవలల్లో ఎంతో పురోగతి కనబడుతుందన్నారు. ఏటీఎంలు, క్రెడిట్ ,డెబిట్ కార్డులు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వంటి ఎన్నో అందుబాటు లోనికి వచ్చాయన్నారు. అయితే వీటి నిర్వహణపై స్పష్టమైన అవగాహన ఖాతాదారులు కలిగి ఉండాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పెంచుకుని ఆర్థిక మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. నగదు రహిత డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించుకోవలన్నారు. సంవత్సరం పొడుగునా ఎక్కడైనా, ఎప్పుడైనా అన్ని వేళలా యుపిఐ, ఆర్టి జిఎస్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు . ఇలా ఎన్నో అనూహ్యమైన సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటి నిర్వహణపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు అనుసరించడం సురక్షితమన్నారు. ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా విద్యార్థుల్లో బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇతర బ్యాంకింగ్ ఆర్థిక కార్యకలాపాలు వంటి అంశాలపై బ్యాంకులు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలన్నారు .ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ లావాదేవీలు మూలంగా అన్ని లెక్కలు వెలుగులోకి వచ్చి నల్లధనం చలామణికి ఆస్కారం ఉండదన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం బ్యాంకులతో అనుసంధానమై వుందన్నారు.దీంతో ప్రతి ఒక్కరూ కనీస ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐ. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 14 నుంచి 18 వరకూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజిటల్ లావాదేవీల సౌలభ్యం, ఆవశ్యకత ,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాజాత ల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో తమ బ్యాంకు ద్వారా 8 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ టెక్నాలజీ విస్తృతి తో వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ చాలా అవసరమన్నారు.

ఎల్ డిఎం ఎస్ఎస్. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో భాగంగా రైతులు, చిన్న వ్యాపారస్తులు, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక బృందాలు, సీనియర్ సిటిజన్ల లో మంచి ఆర్థిక పద్ధతులు, డిజిటల్ వినియోగదారుల రక్షణ గురించి అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంటేటి మధులత,ఏలూరు ఆర్డిఓ పనబాక రచన, డిఆర్ డిఏ పిడి కె. శ్రీనివాసరావు , చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జి. ఎస్. ఎన్ .సతీష్ కుమార్, నాబార్డు డిడిఎం టి.అనిల్ కాంత్, తహసిల్దార్ ఎన్ .వి. నాంచారయ్య, ఎంపిడివో కె. లక్ష్మి, డిప్యూటీ డీఈఓ వెంకటరమణ, ఎంఈఓ బుద్ధ వ్యాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురునాథశర్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
__________
సమాచార పౌరసంబంధాల శాఖ ఏలూరు వారిచే జారీ