పత్రికా ప్రకటన. ఆకివీడు: జూన్ 29,2023. ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతం చేసి జగనన్న సురక్ష పథకానికి మంచి ఫలితాలు సాందించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు

పత్రికా ప్రకటన.
ఆకివీడు: జూన్ 29,2023.
ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతం చేసి జగనన్న సురక్ష పథకానికి మంచి ఫలితాలు సాందించాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు
గురువారం ఆకివీడు మండలం చినకాపవరం, పెదకాపవరం గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగనన్న సురక్ష , అమ్మఒడి తది తర పథకాల లబ్ధిదారుల రిజిస్టర్లను జిల్లా కలెక్టరు పరిశీలించారు. జగనన్న సురక్ష ఇంటింటి సర్వే ఎలా జరుగు తుంది ? ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు పూర్తిఅయ్యాయి , ఇంకా చేయవలసినవి ఎన్ని ఉన్నాయని ఆమె ఆరా తీశారు. సచివాలయాలలో అధికారులు, సచివాలయ సిబ్బందితో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బందికి సూచించారు. ప్రతి పథకం అర్హులు అయిన ప్రతి నిరుపేదకు అందాలని, ఏ వ్యక్తి నాకు ఫలానా పథకం రాలేదనే ఫిర్యాదు రాకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారి, మండల అధికారులు ఖచ్చితంగా మండలంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అవసరాన్ని బట్టి ప్రతి ఇంటిని కూడా సందర్శించి సేకరించిన సమాచారంను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని, ప్రజలు అడిగిన సేవలు నాణ్యతతో అందించటం అత్యంత ముఖ్య మన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా సచివాలయం బయట పథకాల వివరాలను డిస్ప్లే చేయాలన్నారు. అలాగే లబ్ధి దారుల జాబితాను కూడా డిస్ ప్లే బోర్డులలో ఉంచాలన్నారు. సచివాలయం సిబ్బంది చురుకుగా పని చేయాలని అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్పాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అందిస్తున్న సర్వీసులు అన్ని ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లినప్పుడు చిరునవ్వుతో వారి సమస్యను విని అర్జీలను తీసుకోవా లన్నారు. సచివాలయాల పరిధిలో ఒక్క ఇల్లు ను వదిలి పెట్టకుండా సర్వే చెయ్యాలని, ఒక ఇంటిని వదిలినా చర్యలు తప్పవని ఆమె అన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారా, ప్రజలు అర్జీలను సరిగ్గా నమోదు చేసుకుని ఆన్లైన్ చేస్తున్నారా? లేదా అధికారులు పరిశీలన చేసుకోవా లన్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లోనూ నెట్ కనెక్టివిటీ ఉందా లేదా అనేది యంపిడివో లు బాధ్యత తీసుకోవాలన్నారు. నెల రోజుల పాటు జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డిఆర్ డిఎ పిడి యం యస్ యస్ వేణు గోపాల్, తహశీల్దారు విజయ లక్ష్మి, యంపిడివో కె.వాణి, సచివాలయం సిబ్బంది,, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..
జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ.