Close

పత్రికా ప్రకటన అత్తిలి, అక్టోబర్ 20,2022 పేద ప్రజలకు సేవ చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

Publish Date : 20/10/2022

పత్రికా ప్రకటన

అత్తిలి, అక్టోబర్ 20,2022

పేద ప్రజలకు సేవ చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

గురువారం అత్తిలి మండలం పాలి గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రజలు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని, ఎటువంటి ఇబ్బంది లేదని సంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థ చాలా బాగుందని, వాలంటీర్ల కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజలు సంతోషంగా తెలిపారు. ప్రభుత్వ పరంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తానని, అర్హులైన వారు దరఖాస్తులను అందజేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన తెలిపారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో మంత్రి లబ్ధిదారులకు వివరించారు. అలాగే ప్రతి కుటుంబం ఎన్ని సంక్షేమ పథకాలలో భాగస్వాములైందో వారికి వెల్లడించారు. ప్రతి ఇంటిలో ఉన్న అవ్వ, తాతలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించుకుంటున్నారని అన్నారు. మా ఇంటి పెద్దన్న, మా తమ్ముడు, మా కొడుకు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంబోధిస్తున్నారని మంత్రి వెల్లడించారు .ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయలేదని, అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మాత్రమే నూటికి నూరు శాతం అమలు చేసిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అత్తిలి ఎంపీడీవో , స్థానిక నాయకులు , గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

……………………………………..
జిల్లా సమాచార శాఖ భీమవరం నుండి జారీ చేయడమైనది